Asianet News TeluguAsianet News Telugu

సూర్యరశ్మితో కరోనాకి చెక్.. ఆ వేడికి వైరస్ చస్తుందా?

యూఎస్ లోని శాస్త్రవేత్తలు మరో పరిశోధన చేశారు. వారి పరిశోధన ప్రకారం.. సూర్యరశ్శితో కరోనా వైరస్ కి చెక్ పెట్టొచ్చు అని చెబుతున్నారు. 
 

Coronavirus COVID-19 killed by sunlight, warmer temperatures, humidity: US research
Author
Hyderabad, First Published Apr 24, 2020, 11:49 AM IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 2లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కరోనా మరణాలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి మలేరియాకి ఉపయోగించే మందులనే కరోనా రోగులకు ఇస్తుండగా.. వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. కొందరు కోలుకుంటున్నప్పటికీ.. ఆ ప్రభావం చాలా తక్కువగా ఉంది.

ఈ నేపథ్యంలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా వైరస్‌ ని పూర్తిగా నిర్మూలించే మందు కోసం ప్రయోగాలు చేస్తున్నారు. మరి కొందరు దీనిని ఎలా నశింపచేయాలని చూస్తున్నారు. మరికొందరు పరిశోధకులు దీని వ్యాక్సిన్ కోసం.. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

వైరస్ అప్పుడప్పుడే విస్తరిస్తున్న సమయంలో.. వేడి ప్రాంతాల్లో దీని ప్రభావం ఉండదని కొందరు నిపుణులు అన్నారు. కానీ.. వేడి దేశమైన భారత్ లోనూ దీని ప్రభావం బాగానే కనిపిస్తోంది. ఈ విషయంపై ఆ మధ్య ఓ ప్రయోగం కూడా చేశారు. దాదాపు 90డిగ్రీల ఉష్టోగ్రత వద్ద వైరస్ ని ఉంచినా.. అది 15 నిమిషాల పాటు సజీవంగానే ఉంది. దీంతో.. ఉష్ణోగ్రతతో కరోనాని చంపలేమని తేల్చి చెప్పేశారు.

అయితే.. తాజాగా.. ఈ విషయంలో యూఎస్ లోని శాస్త్రవేత్తలు మరో పరిశోధన చేశారు. వారి పరిశోధన ప్రకారం.. సూర్యరశ్శితో కరోనా వైరస్ కి చెక్ పెట్టొచ్చు అని చెబుతున్నారు. 

కృత్రిమ వేడికి పెద్దగా ఇబ్బంది పడని కరోనా వైరస్‌ సూర్య రష్మితో వచ్చే వేడికి మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా గుర్తించారు. సూర్యరష్మిలో కరోనా వైరస్‌ బలహీన పడుతున్నట్లుగా వారు చెబుతున్నారు. సూర్య రష్మిలో ఉన్నప్పుడు ఒకరి నుండి ఒకరికి వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంటుందని అంటున్నారు. వైరస్‌ వ్యాప్తికి సంబంధించిన శీతల ప్రాంతాలే కీలకంగా వారు చెబుతున్నారు. అలా అని పూర్తిగా వ్యాప్తి చెందదు అని మాత్రం నిజం కాదని వారు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios