Asianet News TeluguAsianet News Telugu

బీభత్సంగా కరోనా సెకండ్ వేవ్.. అక్కడ మరోసారి స్కూల్స్ బంద్.. !

కరోనా విద్యార్థుల జీవితాల్ని అల్లకల్లోలం చేస్తోంది. ఒక అకడమిక్ ఇయర్ ను వారి ఖాతాల్లోంచి చెరిపేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. అనేకమంది జీవితాలు తలక్రిందులయ్యాయి. 

corona second wave : schools shut down once again in south korea - bsb
Author
Hyderabad, First Published Dec 14, 2020, 2:47 PM IST

కరోనా విద్యార్థుల జీవితాల్ని అల్లకల్లోలం చేస్తోంది. ఒక అకడమిక్ ఇయర్ ను వారి ఖాతాల్లోంచి చెరిపేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. అనేకమంది జీవితాలు తలక్రిందులయ్యాయి. 

ప్రపంచదేశాలన్నీ కరోనా నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలు, విద్యాసంస్థలన్నింటినీ మూసేసింది. కొద్దికాలంగా ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యాబోధన జరుగుతుంది. గుడ్డిలో మెల్ల అన్నట్టుగ నడుస్తున్న ఈ పద్ధతికీ కరోనా సెకండ్ వేవ్ పెద్ద దెబ్బగా మారింది. 

ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మునపటి కంటే ఈసారి పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూ పోతోంది. దీనితో అక్కడి ప్రభుత్వాలు పలు చోట్ల మళ్లీ లాక్‌డౌన్ కూడా విధించారు.

ఇదే కోవలో దక్షిణ కొరియాలో కూడా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం రాజధాని సియోల్‌లో మంగళవారం నుంచి స్కూల్స్, విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. 

గతంలో నమోదైన పాజిటివ్ కేసుల కంటే ఈసారి గరిష్టస్థాయికి చేరుకుంటుండటంతో ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయితే ఇది ఆసియాలోని నాలుగో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చునని నిపుణులు అంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios