Copenhagen Mall Firing: డెన్మార్క్‌లోని ఓ మాల్‌లో కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఇందులో చాలా మందికి గాయాలయ్యాయి. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు ఓ దుండ‌గుడిని అరెస్టు చేసిన అదుపులోకి తీసుకున్నారు. 

Copenhagen Mall Firing: యూరప్‌లోని డెన్మార్క్‌లో కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. దేశ‌ రాజధాని కోపెన్‌హాగన్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో పలువురు వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ప‌లువురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. కాల్పుల సమాచారం అందుకున్నడెన్మార్క్ పోలీసుల వెంట‌నే రంగంలోకి దిగారు. కాల్పుల‌ను ఆపే ప్ర‌యత్నం చేశారు. ఈ స‌మ‌యంలో ఓ దుండ‌గుగిని పోలీసు అరెస్టు చేశారు.

ఆదివారం నాటి కాల్పుల్లో పలువురు గాయపడినట్లు డెన్మార్క్ పోలీసులు తెలిపారు. సిటీ సెంటర్, విమానాశ్రయం మధ్య ఉన్న అమేగర్ జిల్లాలోని పెద్ద ఫీల్డ్ మాల్ చుట్టూ పోలీసు బలగాలను మోహరించినట్లు కోపెన్‌హాగన్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ కాల్పుల ఘ‌ట‌న గురించి స‌మాచారం అంద‌గానే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, అక్కడ చాలా మంది పై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నామ‌ని కోపెన్ హాగన్ పోలీసులు తెలిపారు. 

కాల్పుల స‌మ‌యంలో ప్రజలు పారిపోతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక మీడియా సంస్థలు పంచుకున్న చిత్రాల్లో భారీ సంఖ్య‌లో పోలీసులు, కనీసం పది అంబులెన్స్‌లు క‌నిపిస్తున్నాయి.