అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జో బైడెన్ ఓ ఆస్తికర విషయానికి తెరలేపారు. అమెరికాలోని ఓ మోడల్ ని ఫాలో చేస్తూ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారారు. బైడెన్ పోటస్ ఫాలోవర్స్ లో క్రిస్సీ టైజెన్ అనే మోడల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. 

వివరాల్లోకివెడితే శుక్రవారం నాటికి బైడెన్‌ ఫాలో అయిన వాళ్ల సంఖ్య 13కు చేరింది. ఆ పదమూడు మందిలో  వైట్‌ హౌస్‌ కోవిడ్‌–19 రెస్పాన్స్‌ టీమ్, వైట్‌ హౌస్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్, వైట్‌ హౌస్‌ డొమెస్టిక్‌ పాలసీ అడ్వైజర్, వైట్‌ హౌస్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్, వైట్‌ హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్, వైట్‌ హౌస్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ది నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్, లాకాసాబ్లాంక్‌ (స్పానిష్‌ లాంగ్వేజ్‌ వైట్‌ హౌస్‌ అకౌంట్స్‌ సెక్షన్‌), వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ, సెకండ్‌ జెంటిల్మన్‌ ఆఫ్‌ ది యునైటెడ్‌ స్టేట్స్, యు.ఎస్‌. ఫస్ట్‌ లేడీ, యు.ఎస్‌. వైస్‌ ప్రెసిడెంట్, ది వైట్‌ హౌస్‌.. ఇంకొకరు క్రిస్సీ టైజెన్‌. 

ఆమె తప్ప మిగతా పన్నెండు మందీ గవర్నమెంట్‌లో ఉన్నవాళ్లు. లేదా గవర్నమెంట్‌ సంస్థలు. క్రిస్సీ ఒక్కరే నాన్‌ గవర్నమెంటల్‌ ! ఇంకా చెప్పాలంటే ఒక మోడల్‌. టీవీ యాంకర్‌. 78 ఏళ్ల బైడెన్‌ 35 ఏళ్ల క్రిస్సీని ఎందుకు ఫాలో అవుతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం. 

క్రిస్సీ అందంగా ఉంటారు. ఆమె భర్త జాన్‌ స్టీఫెన్‌. ఆయన కూడా సింగర్, సాంగ్‌ రైటర్, రికార్డ్‌ ప్రొడ్యూసర్, యాక్టర్, ఫిల్మ్‌ ప్రొడ్యూసర్, థియేటర్‌ డైరెక్టర్, ఫిలాంత్రొఫిస్ట్‌. క్రిస్సీ కూడా తక్కువేమీ కాదు ఆమె అమెరికన్‌ మోడల్, టీవీ పర్సనాలిటీ, ఆథర్, ఆంట్రప్రెన్యూర్‌.

క్రిస్సీకి ముందే చెప్పకుండా పోటస్‌ ఆమెను ఫాలో అయింది. ఆ సంగతిని మొదట కనిపెట్టింది గేబ్‌ ఫ్లెయిషర్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌. టీనేజ్‌ జర్నలిస్ట్‌. అతడి పోస్ట్‌ చూసి, పోటస్‌ను ఓపెన్‌ చేసి ‘ఓ మై గాడ్‌’ అని అరిచేశారు క్రిస్సీ. అరిచేసి, తన పేరుతో ఉన్న బైడెన్‌ ఫాలోయింగ్‌ లిస్ట్‌ని స్క్రీన్‌ షాట్‌ తీసి  ప్రపంచానికి చాటి చెప్పింది.

ఇంతకీ బైడెన్‌ క్రిస్సీని ఫాలో అవ్వడానికి కారణం ఏంటీ అంటే.. బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు బుధవారం క్రిస్సీ ఆయన్ని ఉద్దేశించి కొంటెగా ఒక ట్వీట్‌ పెట్టారు. ‘‘హల్లో జో బైడెన్‌.. ట్రంప్‌ నన్ను నాలుగేళ్లుగా బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. మీరు అన్‌ బ్లాక్‌ చేయగలరా ప్లీజ్‌’’ అని ఆ ట్వీట్‌. 

ఊరికే పెట్టారంతే. కానీ కొద్దిగంటల్లోనే ఆమె కొంటెతనం ఫలించి పోటస్‌లో ప్రతిఫలించింది. బైడెన్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో క్రిస్సీ భర్త ‘సెలబ్రేటింగ్‌ అమెరికా’ అని ఒక మ్యూజిక్‌ కన్సర్ట్‌ ఇచ్చారు. ఆ ప్రభావం కూడా క్రిస్సీని ఫాలో అవడానికి బైడెన్‌ మీద కొంత పని చేసి ఉండొచ్చు. 

మరి ట్రంప్‌ ఎందుకని క్రిస్సీని పోటస్‌లో బ్లాక్‌ చేశాడంటే... అధ్యక్షుడిగా ఆయన ఛార్జి తీసుకోగానే ఆమె పెద్దగా నవ్వారు. ఆ నవ్వే ట్రంప్‌కి కోపం తెప్పించింది. ట్రంప్‌ ఏదో ట్వీట్‌ పెడితే దానికి స్పందిస్తూ.. ‘లాల్ల్‌.. నో వన్‌ లైక్స్‌ యు’ అని ట్వీట్‌ పెట్టారు. అసలే ట్రంప్ దీంతో కోపానికి వచ్చాడు.. అంతే బ్లాక్ చేసి పాడేశాడు.