నేపాల్ లో కుప్పకూలిన హెలికాప్టర్...ఏడుగురు గల్లంతు

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 8, Sep 2018, 4:09 PM IST
Chopper with 7 onboard crashes in Nepal
Highlights

నేపాల్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులను తరలిస్తున్న ఓ హెలికాప్టర్ ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రమాదానికి గురయ్యింది. ఆ దుర్ఘటనలో ఓ విదేశీ పర్యాటకుడితో పాటు మరో ఆరుగురు గల్లంతయ్యారు. 
 

నేపాల్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులను తరలిస్తున్న ఓ హెలికాప్టర్ ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రమాదానికి గురయ్యింది. ఆ దుర్ఘటనలో ఓ విదేశీ పర్యాటకుడితో పాటు మరో ఆరుగురు గల్లంతయ్యారు. 

ఇవాళ గోర్ఖా జిల్లా నుండి ఓ ఆరుగురు ప్రయాణికులతో అల్టిట్యూడ్ సంస్థకు చెందిన ఓ హెలికాప్టర్ బయలుదేరింది. కొద్దిసేపటికే ఎయిర్ ట్రాపిక్ కంట్రోల్ తో ఈ హెలికాప్టర్ సంబంధాలు తెలగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చేపట్టగా దండిల్ ప్రాంతంలోని హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. కొండ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా విమానం కుప్పకూలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో పైలట్ తో పాటు ఆరుగురు ప్రయాణికులు వున్నట్లు ఖాట్మండూ ఎయిర్ పోర్టు జనరల్ మేనేజర్ రాజ్‌కుమార్ తెలిపారు. ఓ విదేశీ పర్వతారోహికుడితో పాటు ఐదుగురు సాధారణ ప్రయాణికులు ఓ పైలట్ గల్లంతయ్యారని ఆయన తెలిపాడు. ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని ఆయన వెల్లడించారు.
 

loader