Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంక‌కు చేరుకున్న చైనా నిఘా నౌక.. భారత్ ఆందోళనకు కారణమేమిటంటే..

చైనా నిఘా నౌక యువాన్ వాంగ్-5 శ్రీలంక‌లోని హంబన్‌టోటా పోర్టుకు మంగళవారం చేరుకుంది. భారతదేశం, అమెరికాల ఆందోళనల మధ్యనే.. యువాన్ వాంగ్-5 నౌక శ్రీలంక జలాల్లోకి ప్రవేశించింది. 

Chinese Spy Ship Yuan Wang 5 arrives Sri Lanka Docks at Hambantota Port
Author
First Published Aug 16, 2022, 10:45 AM IST

చైనా నిఘా నౌక యువాన్ వాంగ్-5 శ్రీలంక‌లోని హంబన్‌టోటా పోర్టుకు మంగళవారం చేరుకుంది. భారతదేశం, అమెరికాల ఆందోళనల మధ్యనే.. యువాన్ వాంగ్-5 నౌక శ్రీలంక జలాల్లోకి ప్రవేశించింది. ఈ నౌకలో దాదాపు 2 వేల మంది నావికకులు ఉన్నారు. అలాగే నౌకలో ఉపగ్రహాలు, ఖండాంతర క్షిపణులను ట్రాక్ చేసే సౌకర్యాలు ఉన్నాయి. ఈ నౌక ఆగస్టు 22 వరకు శ్రీలంక జలాల్లో ఉండనుంది. అయితే చైనా నిఘా నౌక శ్రీలంక జలాల్లోకి ప్రవేశించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ నౌకను అనుతించవద్దని శ్రీలంకను కోరింది. 

ఈ క్రమంలోనే ఈ నెల 11వ తేదీన హంబన్‌టోటా పోర్టు చేరుకోవాల్సిన ఉన్న యువాన్ వాంగ్-5 నౌకకు శ్రీలంక అనుమతులు ఇవ్వలేదు. నౌక ప్రయాణాన్ని వాయిదా వేయాలని చైనాను కోరింది. అయితే నౌక వాయిదాకు సంబంధించి చైనా నుంచి ఎదురైన ప్రశ్నలకు శ్రీలంక సంతృప్తికర జవాబు ఇవ్వలేకపోయిందని సంబంధిత వర్గాలు తెలియయి. ఈ పరిణామాలతో యువాన్ వాంగ్-5 నౌకకు శ్రీలంక అనుమతులు మంజూరు చేసింది.  చైనాకు చెందిన యువాన్ వాంగ్ 5 ఈ నెల 16  నుంచి 22 శ్రీలంక జలాల్లో ఉండేందుకు అనుమతి ఇచ్చినట్టుగా శ్రీలంక అధికారులు పేర్కొన్నారు. అయితే చైనా, శ్రీలంక దేశాల మధ్య చర్చల వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి,

ఇక, శ్రీలంక హంబన్‌టోటా పోర్టును 99 ఏళ్లకు లీజ్‌కు ఇచ్చినప్పటీ నుంచి భారత్ ఆందోళనలు వ్యక్తం చేస్తూ వస్తోంది. తాజాగా యువాన్ వాంగ్-5 నిఘా నౌక శ్రీలంక జలాల్లో వారం రోజుల పాటు లంగరు వేయనుంది. ఈ పరిణామాలపై భారత్‌తో పాటు, అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. నౌకలో ఉపగ్రహాలు, ఖండాంతర క్షిపణులను ట్రాక్ చేసే సౌకర్యాలు ఉండటం.. అవి 750 కి.మీపైగా దూరంలోని ప్రాంతాలపై నిఘా ఉంచగలవని చెబుతున్నారు. దీంతో యువాన్ వాంగ్-5 నౌక.. దక్షిణ భారత్‌లోని పోర్టులు, క్షిపణి కేంద్రాలపై నిఘా ఉంచగల సామర్థ్యం కలిగి ఉండటంతో భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. 

ఈ క్రమంలోనే యువాన్ వాంగ్-5 నౌక  శ్రీలంక వస్తుండటాన్ని తాము దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత రక్షణ, ఆర్థిక ప్రయోజనాల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వివరించింది.

ఇక, శ్రీలంక సముద్ర గస్తీ మెరుగుపరుచుకునేందుకు భారత్‌ డోర్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను బహుమతిగా అందజేసిన సంగతి తెలిసిందే. దీనిని కటునాయకే ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ వద్ద శ్రీలంకకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే కూడా పాల్గొన్నారు. అయితే ఇది జరిగిన ఒక్క రోజు తర్వాతే.. యువాన్ వాంగ్-5 శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టుకు చేరుకోవడం గమనార్హం.

అయితే హంబంటోటా పోర్టును చైనా ఇచ్చిన రుణాలతో నిర్మించారు. అయితే ఈ రుణం చెల్లించడంలో శ్రీలంక విఫలమైంది. దీంతో హంబంటోటా పోర్టును చైనా మర్చంట్స్ పోర్ట్ హోల్డింగ్స్ కో నేతృత్వంలోని వెంచర్‌కు 99 సంవత్సరాల పాటు లీజ్‌‌కు ఇచ్చేందుకు అంగీకరించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios