Russia Ukraine War: యుద్ధం ఎవరికీ ప్రయోజనం కలిగించదని, ప్ర‌పంచంలో శాంతి నెల‌కొలిపే బాధ్యతను చైనా, యునైటెడ్ స్టేట్స్ అమెరికా లే భుజాలకెత్తుకోవాల‌ని చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ అన్నారు. యుక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా తీవ్రంగా ఖండిస్తుంది.   

Russia Ukraine War: ప్ర‌పంచంలో శాంతి నెల‌కొలిపే బాధ్యతను చైనా, యునైటెడ్ స్టేట్స్ అమెరికా లే భుజాలకెత్తుకోవాల‌ని చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ అన్నారు. ప్రపంచ‌ శాంతి, భద్రత అంతర్జాతీయ సమాజానికి అత్యంత విలువైన సంపదలని ప్రకటించారు. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌, చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ మ‌ధ్య శుక్ర‌వారం వ‌ర్చువ‌ల్ సంభాష‌ణ జ‌రిగింది. 

ఈ సంద‌ర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ప్ర‌పంచ శాంతి నెల‌కొనాలంటే చైనా, అమెరికా చేతులు క‌ల‌పాల‌ని ఆకాంక్షించారు. ఉక్రెయిన్‌, ర‌ష్యా మ‌ధ్య జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ఎవ్వ‌రూ కోరుకోర‌ని, ఈ ప‌రిణామాల వ‌ల్ల ఎవ్వ‌రికీ ప్ర‌యోజ‌నం కూడా లేద‌ని జిన్‌పింగ్ స్ప‌ష్టం చేశారు. ఏ దేశాల మ‌ధ్య అయినా సంబంధాలు యుద్ధం వైపుకు దారితీయ‌వ‌ద్ద‌ని, శాంతియుతంగానే వుండాల‌ని జిన్‌పింగ్ పేర్కొన్నారు. శాంతి, భ‌ద్ర‌త అనేవి ప్ర‌పంచ దేశాలు పెద్ద సంప‌ద లాంటివ‌ని, అవి భ‌గ్నం కాకుండా చూడాలని జిన్‌పింగ్ కోరారు.

 ప్రపంచ శాంతి, అభివృద్ధి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని షీ జిన్ పింగ్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచం సామరస్యంగానూ, స్థిరంగానూ లేదనీ ఆందోళ‌న వ్యక్తం చేశారు. ప్ర‌పంచ దేశాలు కోరుకుంటున్నది ఉక్రెయిన్​ సంక్షోభం కాదనీ, ప్ర‌పంచ శాంతిని ఇరు దేశాలు నెల‌కొల్ప‌ల‌ని అన్నారు. ఏదైనా స‌మ‌స్య ఉంటే.. చ‌ర్చ‌ల‌తో ప‌రిష్క‌రించుకోవాలని, ఇలా రణరంగంలోకి రాకూడదని అన్నారు.
ఘర్షణ వాతావ‌ర‌ణాన్ని ఎవరూ కోరుకోరని. . శాంతి, భద్రతల కోసం కృషి చేయాల‌ని అన్నారు. ఐరాస భద్రత మండలిలో శాశ్వత సభ్యులుగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఇరు దేశాల సంబంధాలు సరైన మార్గంలో పయనించేలా చూడాలని జిన్​పింగ్ అన్నారు.

ఇప్పటివరకు బీజింగ్ తన తోటి అధికార మిత్రపక్షం ర‌ష్యాను ఖండించడానికి నిరాకరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని జిన్‌పింగ్ ప్రత్యక్షంగా ఏదైనా విమర్శలు చేశారా? క్రెమ్లిన్‌పై అమెరికా నేతృత్వంలో ప్ర‌పంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ త‌రుణంలో జిన్‌పింగ్.. ఆ ఆంశంపై స్పందించలేదు. రష్యాకు ఆర్థిక, సైనిక మద్దతును చైనా అందించగలదని వాషింగ్టన్ భయపడుతోంది, ఇది ఇప్పటికే పేలుడుగా ఉన్న అట్లాంటిక్ ఖండాంతర ప్రతిష్టంభనను ప్రపంచ వివాదంగా మారుస్తుంది.

అది జరిగితే, ఆంక్షలు విధించడానికి, అతని యుద్ధాన్ని కొనసాగించడానికి బీజింగ్ పుతిన్‌కు సహాయం చేయడమే కాకుండా, పాశ్చాత్య ప్రభుత్వాలు ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై ఎలా తిరిగి దాడి చేయాలనే బాధాకరమైన నిర్ణయాన్ని ఎదుర్కొంటాయి, ఇది అంతర్జాతీయ మార్కెట్లలో గందరగోళాన్ని ప్రేరేపిస్తుంది.