Asianet News TeluguAsianet News Telugu

డైపర్లు పెట్టుకోండి.. కరోనాతో పోరాడండి.. : చైనా

కరోనా రిస్క్ ను ఎదుర్కోవడానికి విమానయాన సిబ్బంది డైపర్లు వాడాలంటూ చైనా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉన్న విమానాల్లో..సిబ్బంది డైపర్లు ధరించాలని సూచించింది. ప్లేన్‌లోని బాత్రూమ్‌లు వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఈ నిబంధన సాధారణ ఎయిర్‌లైన్ కంపెనీలతో పాటూ ఛార్టెడ్ ఫ్టైట్‌లకూ వర్తిస్తుందని చైనా విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది.  

China Tells Cabin Crew to Wear Diapers on Risky Covid Flights - bsb
Author
Hyderabad, First Published Dec 10, 2020, 1:48 PM IST

కరోనా రిస్క్ ను ఎదుర్కోవడానికి విమానయాన సిబ్బంది డైపర్లు వాడాలంటూ చైనా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉన్న విమానాల్లో..సిబ్బంది డైపర్లు ధరించాలని సూచించింది. ప్లేన్‌లోని బాత్రూమ్‌లు వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఈ నిబంధన సాధారణ ఎయిర్‌లైన్ కంపెనీలతో పాటూ ఛార్టెడ్ ఫ్టైట్‌లకూ వర్తిస్తుందని చైనా విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది.  

కరోనా కారణంగా ప్రపంచదేశాలు స్తంభించిపోయాయి. ఇప్పుడిప్పుడే మెల్లగా మళ్లీ కార్యకలాపాలు మొదలుపెడుతున్నాయి. వీటిల్లో విమాన యాన రంగం ఒకటి. కరోనా సంక్షోభం కారణంగా  తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇటీవల వివిధ దేశాల్లో లాక్ డౌన్ ముగియడంతో మెల్లమెల్లగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. 

ఈ నేపథ్యంలో చైనా విమానయాన మంత్రిత్వ శాఖ ఫ్లైట్ సిబ్బంది రక్షణ దృష్ట్యా కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉన్న విమానాల్లో..సిబ్బంది డైపర్లు ధరించాలని సూచించింది. ప్లేన్‌లోని బాత్రూమ్‌లు వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఈ నిబంధన సాధారణ ఎయిర్‌లైన్ కంపెనీలతో పాటూ ఛార్టెడ్ ఫ్టైట్‌లకూ వర్తిస్తుందని పేర్కొంది.  

అయితే, కరోనా సంక్షోభం కొనసాగుతున్నా విమానప్రయాణాలు కొనసాగించవచ్చని ఎయిర్‌లైన్స్ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నాయి. విమానాల్లో ఎయిర్ ఫిల్టర్లలకు ఆస్పత్తుల్లోని పరికరాలతో సరితూగే సామర్థ్యం ఉంటుందని అవి చెప్పుకొచ్చాయి. అయితే..దీని వల్ల కరోనా రిస్క్ కనిష్ట స్థాయికి చేరుకునేందుకు శాస్త్రపరమైన ఆధారాలేమీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. 

విమానంలోని ప్రయాణికులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించినా కూడా కొన్ని సందర్భాల్లో కరోనా వ్యాప్తి జరిగిందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. కరోనా దెబ్బకు కుదేలైన చైనా విమానయాన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అంతర్జాతీయ సర్వీసులు పరిమితంగానే ఉన్నా దేశీయంగా డిమాండ్ పుంజు కోవడంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు సంబరపడుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios