Asianet News TeluguAsianet News Telugu

‘మంకీ బీ’ : కరోనా కంటే డేంజర్... చైనాలో మరో కొత్త వైరస్, ఒకరి మృతి !!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన మరో కొత్త వైరస్ చైనాలో బయటపడింది, ‘మంకీ బీ’గా పిలిచే ఈ కొత్త వైరస్ తో చైనాలో  ఒక శాస్త్రవేత్త మరణించడం కలకలం రేపుతోంది.

China reports first human death caused by 'Monkey B Virus' - bsb
Author
Hyderabad, First Published Jul 19, 2021, 3:17 PM IST

కోవిడ్ 19 మొదటి, రెండో వేవ్ లతోనే ప్రపంచం అల్లాడిపోతుంటే.. మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఊహాగానాలు, హెచ్చరికలతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రజలు భయాందోళనల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా కంటే భయంకరమైన వైరస్ మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చైనాలోనే బయపటడడం దీన్ని.. అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఆందోళన నెలకొంది. 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన మరో కొత్త వైరస్ చైనాలో బయటపడింది, ‘మంకీ బీ’గా పిలిచే ఈ కొత్త వైరస్ తో చైనాలో  ఒక శాస్త్రవేత్త మరణించడం కలకలం రేపుతోంది. కోతులపై పరిశోధనలు చేసే పశు వైద్య నిపుణులు ఒకరు మంకీ బీ బారినపడి మరణించారు.

మంకీ బీ వైరస్ బయటపడేందుకు ఒకటి నుంచి మూడు వారాల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంకీ బీ వైరస్ సోకితే ప్రధానంగా    నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని గుర్తించారు. వైరస్ సోకితే 70 నుంచి 80 శాతం మంది మరణించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారికి జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, విపరీతమైన అలసట వచ్చే ప్రమాదం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios