జనవరి 10న చైనాలోని షాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని బంగారు గనిలో పేలుడు జరిగిన రెండు వారాలకు సహాయక బృందాలు ప్రమాదంలో చిక్కుకున్న వారి వద్దకు చేరుకున్నారు. రెండువారాల పాటు గనిలో చిక్కుకున్న వారిలో 10 మంది మృత్యువాత పడగా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
జనవరి 10న చైనాలోని షాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని బంగారు గనిలో పేలుడు జరిగిన రెండు వారాలకు సహాయక బృందాలు ప్రమాదంలో చిక్కుకున్న వారి వద్దకు చేరుకున్నారు. రెండువారాల పాటు గనిలో చిక్కుకున్న వారిలో 10 మంది మృత్యువాత పడగా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
జనవరి 10న బంగారు గనిలో ప్రమాదం సంభవించగా.. ప్రమాదం జరిగిన విషయం మాత్రం 30 గంటల తర్వాత అధికారులకు తెలిసింది.దీంతో బాధితులను కాపాడే ప్రయత్నాలు ఆలస్యమయ్యాయి. విషయం తెలిసిన అనంతరం హుటాహుటిన నిపుణులను తరలించి వారిని వెలికితీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే భూగర్భంలో నీటి తాకిడి భారీగా ఉండడంతో సహాయ చర్యలకు ఆటంకంగా మారింది.
గని ముఖద్వారంపై వెయ్యి అడుగుల లోతున 70 టన్నుల మట్టి కూరుకుపోవడంతో మరింత కష్టమైంది. వారిని బయటకు తీసేందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. లోపల ఉన్నవారి పరిస్థితిపై ఆందోళన చెందిన అధికారులు వీలైనంత త్వరగా బయటకు తీసుకొద్దామని ప్రయత్నించారు.
రెండు వారాల పాటు తీవ్రంగా శ్రమించి ప్రమాదంలో చిక్కుకున్న వారిని 25వ తేదీన బయటకు తీసుకొచ్చారు. అయితే అధికారులు చేరుకునేలోపు 10 మంది మరణించగా, మరో 11 మంది ప్రాణాలతో ఉన్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. మరొక వ్యక్తి ఆచూకీ లభించలేదు. అతడి కోసం అధికారులు వెతుకున్నారు.
అయితే గనిలో పేలుడుకు కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. చైనాలో మైనింగ్ పరిశ్రమలో ప్రమాదాలు తరచూ సంభవిస్తుంటాయి. ఏటా దాదాపు 5 వేల మంది మరణిస్తుంటారని ఆ దేశ మీడియా తెలిపింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 26, 2021, 9:52 AM IST