China: చైనాలో మ‌రోసారి కరోనా కలవరపాటుకు గురి చేస్తుంది. దీంతో చైనాలోని అధికారులు సైతం అప్రమత్తమై కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించింది కూడా. ఈ క్ర‌మంలో ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లోని సిపింగ్, డన్‌హువా నగరాల్లో కేసుల సంఖ్య తీవ్రం కావ‌డంతో చైనా అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. తాత్కాలికా ఆసుపత్రులను నిర్మించాల‌ని 6 వేల పడకల గల ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించారు.  ఈ ఆసుపత్రి ఆరు రోజుల్లోనే వినియోగానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. 

China: ఇప్పుడిప్పుడే కరోనా మ‌హ‌మ్మారి పీడ పోయింది. సాధార‌ణ జీవితాన్ని తిరిగి గ‌డ‌ప‌వ‌చ్చున‌నీ ప్ర‌పంచ దేశాలు ఊపిరి తీసుకుంటున్న వేళ మళ్లీ భయంకరమైన భారీ షాక్‌ తగిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌మంతా క‌రోనాతో పోరాడుతూనే ఉన్న‌ది. ఇప్ప‌టికే థ‌ర్డ్ వేవ్ కూడా ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌ను చేసింది.

తాజాగా.. కరోనా పుట్టినిల్లు చైనాలో మ‌రోసారి క‌రోనా విజృంభిస్తుంది. గ‌త వారం రోజులుగా చైనాలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతోందిదీంతో చైనాలో అధికారులు మ‌రోసారి అప్ర‌మ‌త్తమ‌య్యారు. కఠిన ఆంక్ష‌లు విధించ‌డానికి సిద్ద‌మ‌య్యారు. ప‌లు న‌గ‌రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను విధించారు. ఈ క్ర‌మంలో 2020 నాటి ప‌రిస్థితులను ఊహించి.. వెంట‌నే 6000 బెడ్స్‌తో తాత్కాలిక హాస్పిట‌ల్ నిర్మాణాన్ని చైనా ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసింది. ఈ ఆస్ప‌త్రిని చైనాలోని జిలిన్ సిటీలో కేవ‌లం ఆరు రోజుల్లోనే నిర్మించ త‌ల‌పెట్ట‌నున్నారు.

ఇప్ప‌టికే.. నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఇదిలా ఉంటే.. జిలిన్ ప్రావిన్స్‌లోనే రోజుకు వెయ్యికి పైగా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. చైనా వ్యాప్తంగా సోమ‌వారం 2300 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఆదివారం మాత్రం 3400 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో ప‌లు ప్రాంతాల‌ను 
కోవిడ్ 19 హాట్‌స్పాట్స్‌గా గుర్తించి .. లాక్ డౌన్ ను అమ‌లు చేస్తున్నారు. ప్ర‌ధాన ప‌ట్ట‌ణం షాంగైలోనూ క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లులో ఉన్నాయి. స్కూల్స్, రెస్టారెంట్స్‌, షాపింగ్ మాల్స్ అన్నింటిని తాత్కాలికంగా మూత‌ప‌డ్డాయి.

అంతేకాదు.. ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లోని సిపింగ్, డన్‌హువా నగరాల్లో భారీ సంఖ్య‌లో కేసులు న‌మోదు కావ‌డంతో యుద్ద ప్ర‌తిపాదిక‌న 6 వేల పడకల గల ఆసుపత్రిని నిర్మించ త‌లపెట్టారు. తాత్కాలికా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన వీడియోని చైనా స్ధానిక మీడియా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఇదిలా ఉంటే.. జిలిన్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించ‌లేదని జిలిన్ ప్రావిన్షియల్ హెల్త్ కమీషన్ అధికారి జాంగ్ యాన్ ఆరోపించారు. ఈ క్ర‌మంలో ఆ ప్రావిన్స్‌ మేయర్‌ని ప‌దవి నుంచి తొలగించినట్లు తెలిపారు.

Scroll to load tweet…