Asianet News TeluguAsianet News Telugu

నకిలీ కరోనా వ్యాక్సిన్: చైనాలో 80 మంది అరెస్ట్

నకిలీ కరోనా వ్యాక్సిన్ ను సరఫరా చేస్తున్న 80 మందిని చైనాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ టీకాలు ఇప్పటికే కొన్ని ఆఫ్రికా దేశాలకు చేరుకొన్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
 

China arrests more than 80 people in 'fake vaccine' ring crackdown lns
Author
Beijing, First Published Feb 3, 2021, 1:22 PM IST


బీజింగ్: నకిలీ కరోనా వ్యాక్సిన్ ను సరఫరా చేస్తున్న 80 మందిని చైనాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ టీకాలు ఇప్పటికే కొన్ని ఆఫ్రికా దేశాలకు చేరుకొన్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు.

మూడు వేలకు పైగా నకిలీ కరోనా వ్యాక్సిన్ డోస్ లను నిందితులు ఉత్పత్తి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. చైనాలోని జియాంగ్స్  ప్రావిన్స్ లో ఈ ఘటన చోటు చేసుకొందని స్థానిక న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.

నకిలీ వ్యాక్సిన్ల తయారీ, విక్రయాలకు సంబంధించిన నేరాలపై చైనా వ్యాధుల మంత్రిత్వశాఖ దర్యాప్తు చేస్తోందని అధికారులు ప్రకటించారు.గత ఏడాది సెప్టెంబర్ మాసం నుండి నకిలీ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇంజెక్టర్లలో సెలైన్ ద్రావణాన్ని ఎక్కించి వ్యాక్సిన్ గా నమ్మించి విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు.

దేశంలోని ప్రజలకు సినోవాక్, సినోఫార్మ్ అనే రెండు కంపెనీల టీకాాలను అందిస్తోంది ఆ ప్రభుత్వం. ఈ రెండు టీకాలు టర్కీలో తయారు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios