KTR in America: తెలంగాణ రాష్టానికి భారీ మొత్తంలో పెట్టుబడులు తీసుకరావాలనే ప్రయత్నంలో మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తోన్నారు. ఈ క్రమంలో ప్రముఖ పరిశోధన సంస్థ కెమ్ వేద కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ. 150 కోట్ల రూపాయల(150Crores) పెట్టుబడులు పెడుతున్నట్టు సంస్థ తెలిపింది. హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
KTR in America: తెలంగాణ రాష్టానికి భారీ మొత్తంలో పెట్టుబడులు తీసుకరావాలనే ప్రయత్నంలో మంత్రి కేటీఆర్ అమెరికాలో చాలా బిజీబిజీగా పర్యటిస్తోన్నారు. ఆరంభం అదుర్స్ అన్నట్టుగా.. తొలి రోజు పర్యటన సక్సెస్ పుల్ గా ప్రారంభమైంది. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ అయిన కెమ్ వేద Chem Vedic Life Sciences సుముఖత చూపించింది. మంత్రి కేటీఆర్ ఆ సంస్థ కార్యాలయం(శాండియాగో)లో సమావేశమయ్యారు. ఈ సమావేశ అనంతరం ప్రకటన వెల్లడించారు.
ప్రముఖ పరిశోధన సంస్థ కెమ్ వేద కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ. 150 కోట్ల రూపాయల(150Crores) పెట్టుబడులు పెడుతున్నట్టు సంస్థ తెలిపింది. హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఫార్మా లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఈకో సిస్టంను కెమ్ వేద లైఫ్ సైన్సెస్ సెంటర్ మరింత బలోపేతం చేస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ , ఆగ్రో కెమికల్ పరిశ్రమలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది. కెమ్ వేద కంపెనీ..కేవలం 45 మంది ఉద్యోగుల తో ప్రారంభమైందనీ, నేడు ఈ కంపెనీలో 450 మంది పనిచేస్తున్నారని, దీనిని మరింతగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. తమ కంపెనీని తెలంగాణ రాష్ట్రంలో పెట్టడానికి.. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, అక్కడ ఉన్న నాణ్యమైన మానవ వనరులే ప్రధాన కారణాలని తెలిపింది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన కెమ్ వేద లైఫ్ సైన్సెస్ కంపెనీ కి ధన్యవాదాలు తెలిపారు. నగరంలో ఫార్మా లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్‌లో ఉన్న మానవ వనరులు అవకాశాలను ఉపయోగించుకొని ప్రత్యేకంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కంపెనీకి ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కంపెనీ రావడంతో హైదరాబాద్ ఫార్మా లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఈకో సిస్టంను ఈ డెవలప్మెంట్ సెంటర్ మరింత బలోపేతం చేస్తుంది అని కేటీఆర్ తెలిపారు.
కేటీఆర్ కు అపూర్వ స్వాగతం..
అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ తొలి రోజు సమావేశాల కోసం అమెరికాలోని శాన్ డియాగో వెళ్లారు. ఈ క్రమంలో మంత్రి కేటీరాకు స్థానికంగా ఉన్న తెలుగు ఎన్నారైలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. శాన్డియాగో లో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాల గురించి వారిని అడిగి మంత్రి తెలుసుకున్నారు. తమ నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటించడం పట్ల ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేశారు.
