Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో క్రిస్మస్ పరేడ్ పైకి దూసుకెళ్లిన కారు, పలువురు మృతి, 20మందికి పైగా గాయాలు...

వందలాది మంది ఉల్లాసంగా పాటలు పాడుతూ ర్యాలీగా వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఓ ఎస్ యూవీ బారికేడ్లను ఢీకొట్టి మనుషుల మీదినుంచి దూసుకెళ్లింది. అక్కడున్న పోలీసుల అధికారి కారుపై కాల్పులు జరిపి అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ డ్రైవర్ ఆగకుండా వేగంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ ఊహించని పరిణామంతో ప్రజలంతా భయబ్రాంతులకు గురయ్యారు.

car crashes into a christmas parade in the US, multiple dead, several injured in america
Author
Hyderabad, First Published Nov 22, 2021, 11:53 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలోని విస్కన్ సిన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. క్రిస్మస్ పరేడ్ పైకి ఓ S.U.V వేగంగా దూసుకువెళ్లింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మరికొద్ది రోజుల్లో Christmas పండగను పురస్కరించుకుని విల్ వాకీ శివారులోని Wakisha Town లో ఆదివారం సాయంత్రం సంప్రదాయ వార్షిక పరేడ్ ను నిర్వహించారు. 

వందలాది మంది ఉల్లాసంగా పాటలు పాడుతూ ర్యాలీగా వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఓ ఎస్ యూవీ బారికేడ్లను ఢీకొట్టి మనుషుల మీదినుంచి దూసుకెళ్లింది. అక్కడున్న పోలీసుల అధికారి Carపై కాల్పులు జరిపి అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ డ్రైవర్ ఆగకుండా వేగంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ ఊహించని పరిణామంతో ప్రజలంతా భయబ్రాంతులకు గురయ్యారు.

అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్నది అధికారికంగా ఇంకా ధృవీకరించలేదని పేర్కొన్నాయి. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. 

Parade పైకి కారు దూసుకెల్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఘటనకు కారణమైన ఎస్ యూవీ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే, ఘటనకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికి ఇందులో ఎలాంటి ఉగ్రకోణం లేదని, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా, రెండు నవంబర్ 18న అమెరికాలో ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. వాషింగ్టన్ లో  ప్రముఖ Rapper Young Dolph లక్ష్యంగా ఓ గన్ పేలింది. టెన్నెస్సీలోని మెంఫిస్‌లో చోటుచేసుకున్న తుపాకీ కాల్పుల్లో 36 ఏళ్ల యంగ్ డాల్ఫ్ దుర్మరణం చెందారు. మెంఫిస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఓ కుకీ షాప్‌లో కాల్పులు జరిగాయి.

యంగ్ డాల్ఫ్ Tennesseలోని సొంత పట్టణం మెంఫిస్‌కు వచ్చాడు. ఇక్కడ ఆయన బంధువురాలు ఒకరికి క్యాన్సర్ సోకడంతో ఆమెను పరామర్శించడానికి సోమవారం మెంఫిస్ పట్టణానికి వచ్చాడు. అని సోదరి మరేనో మైర్స్ తెలిపింది. ఈ వారం మొదట్లోనూ ఆయన కుకీ షాప్‌నకు వెళ్లాడని ఆమె వివరించింది. ఈ రోజు కూడా ఆయన కుకీ షాప్‌లోపల ఉండగానే ఓ దుండగుడు షాప్‌లోకి వెళ్లి ర్యాపర్ యంగ్ డాల్ఫ్‌ను చంపేసినట్టు పేర్కొంది.

రోడ్లపై కరెన్సీ నోట్లు: వాహనాలు ఆపి తీసుకొన్న జనం, ట్రాఫిక్ జామ్

కాగా, ఈ ఘటన అనంతరం మెంఫిస్ పోలీసు డైరెక్టర్ డేవిస్ విలేకరులతో మాట్లాడారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఎవరూ ఇంటి నుంచి బయట అడుగు పెట్టవద్దని సూచనలు చేశారు. అవసరమైతే పరిస్థితులను బట్టి కర్ఫ్యూ విధించడానికి వెనుకాడబోమని వివరించారు. కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తికి సంబంధించి తమ దగ్గర ఎలాంటి సమాచారమూ లేదని పోలీసులు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

చికాగోలో జన్మించిన యంగ్ డాల్ఫ్ అసలు పేరు అడాల్ఫ్ థోర్న్‌టన్. 2008 నుంచి ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే విశేష ఆదరణ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా హిప్ హాప్ కమ్యూనిటీలో ఆయనకు మంచి పేరుంది. పేపర్ రూట్ క్యాంపెయిన్, కింగ్ ఆఫ్ మెంఫిస్, రిచ్ స్లేవ్ వంటి ఆల్బమ్స్ ప్రజాదరణ పొందాయి. ఇందులో గతేడాది ఆయన రూపొందించిన రిచ్ స్లేవ్ ఆల్బమ్ బిల్‌బోర్డు 200లో నెంబర్ 4 ర్యాంక్ సంపాదించుకుంది. బిల్‌బోర్డు 200లో టాప్ టెన్ ర్యాంకుల్లో యంగ్ డాల్ఫ్ ఆల్బమ్‌లు మూడు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios