Asianet News TeluguAsianet News Telugu

నాసల్ స్ప్రే : కరోనాను 99 శాతం ఖతం చేస్తుంది..

కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతికి ప్రపంచమంతా గడగడలాడుతోంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు తమ టీకా కార్యక్రమాన్ని విస్తరించి, పిల్లలు, తక్కువ ముప్పు ఉన్న వర్గాలకూ వ్యాక్సిన్లు ఇస్తున్నాయి. ప్రస్తుతమున్న కరోనా వైరస్ రకాలను ఎదుర్కొనేలాతమ డోసుల సమర్థతను పెంచేందుకు అనేక  టీకా కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. 

Canadian biotech firm claims its nasal spray kills 99% viral load of Covid-19 - bsb
Author
Hyderabad, First Published May 29, 2021, 5:14 PM IST

కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతికి ప్రపంచమంతా గడగడలాడుతోంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు తమ టీకా కార్యక్రమాన్ని విస్తరించి, పిల్లలు, తక్కువ ముప్పు ఉన్న వర్గాలకూ వ్యాక్సిన్లు ఇస్తున్నాయి. ప్రస్తుతమున్న కరోనా వైరస్ రకాలను ఎదుర్కొనేలాతమ డోసుల సమర్థతను పెంచేందుకు అనేక  టీకా కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. 

అయితే ముక్కులో వేసే నాసిల్ స్ప్రేల రాకతో ఈ మహమ్మారిపై పోరాటం కొత్త మలుపు తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెనడాలోని ‘శానోటైజ్ రీసెర్చ్ అండ్ కార్పొరేషన్’ అనే సంస్థ నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (ఎన్ఓఎన్ఎస్)ను తయారు చేసింది. 

ఇది కోవిడ్ బాధితుల్లో వైరస్ లోడును 99 శాతం మేర నిర్మూలిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఔషధం ఎగువ శ్వాసనాళాల్లోని వైరస్ ను చంపేస్తుందని తెలిపింది. లేకుంటే ఆ వైరస్ తొలుత అక్కడ పాగా వేసి, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి విస్తరిస్తుంది.

కరోనా హైబ్రీడ్ ...యమా డేంజర్, గాలి ద్వారా ఒకరినుంచి ఒకరికి... !!...

ఈ పరిస్థితిని ఎన్ఓఎన్ఎస్ నివారిస్తుంది. కోవిడ్ బారిన పడిన 79 మందిపై ఈ స్ప్రేను పరీక్షించారు. దీన్ని వాడిన 24 గంటల్లో 95 శాతం మేర వైరల్ లోడ్ తగ్గిపోయిందని తేల్చారు.  72 గంటల్లో 99 శాతం మేర వైరస్ను ఇది నిర్మూలించిందని వారు పేర్కొన్నారు. 

బ్రిటన్లో మొదట వెలుగుచూసిన కరోనా వైరస్ రకంపై కూడా ఇది సమర్థంగా పని చేసిందని వివరించారు. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని పేర్కొన్నారు. దీని వినియోగానికి ఇజ్రాయిల్, న్యూజిలాండ్ ఇటీవల పచ్చజెండా ఊపాయి. భారత్లోనూ దీన్ని ఉత్పత్తి చేసేందుకు శానోటైజ్ సంస్థ సంప్రదింపులు సాగిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios