Asianet News TeluguAsianet News Telugu

అదృష్టం అంటే ఇతనిదే... రాత్రికి రాత్రే మిలీనియర్ అయ్యాడు..!

ఏదో ఒకటి పిక్ అవ్వకపోతుందా అనే ఆశ ఉంటుంది. ఓ వ్యక్తి కూడా ఇలానే రెగ్యూలర్ గా లాటరీలు వేసి, చివరకు జాక్ పాట్ కొట్టేశాడు. అతనిని అదృష్ట దేవత వరించింది.

California Lottery Player Wins $1.73 Billion Powerball Jackpot, Second-Largest In US History ram
Author
First Published Oct 13, 2023, 9:49 AM IST | Last Updated Oct 13, 2023, 9:49 AM IST

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు.  ఒక్కసారి అదృష్టం వరిస్తే మాత్రం జీవితం మొత్తం మారిపోతుంది. తాజాగా ఓ వ్యక్తి జీవితం అలానే మారిపోయింది. రాత్రికి రాత్రే  ఓ వ్యక్తి మిలీనియర్ అయిపోయాడు. ప్రపంచంలో కెల్లా రెండో అతిపెద్ద జాక్ పాట్ అతను గెలుచుకున్నాడు.  ఈ సంఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చాలా మందికి లాటరీలు వేసే అలవాటు ఉంటుంది. రెగ్యులర్ గా లాటరీ వేయడం వల్ల,  ఏదో ఒకటి పిక్ అవ్వకపోతుందా అనే ఆశ ఉంటుంది. ఓ వ్యక్తి కూడా ఇలానే రెగ్యూలర్ గా లాటరీలు వేసి, చివరకు జాక్ పాట్ కొట్టేశాడు. అతనిని అదృష్ట దేవత వరించింది.

 అమెరికా(USA) కి చెందిన ఓ  వ్యక్తికి ఎవరూ కలలో కూడా ఊహించలేని మొత్తం  లాటరీలో దక్కింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద లాటరీగా పేరుగాంచిన పవర్ బాల్ లాటరీని(Powerball) అతడు గెలుచుకున్నాడు. అతడు గెలుచుకున్న సొమ్ము 1.73 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు రూ.14,400 కోట్లు!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios