సోఫియా: బల్గేరియా ప్రధానమంత్రి బొకియో బొరిసోవ్ కరోనా బారినపడ్డారు.

కరోనా బారినపడినప్పటికి ఆయన తన విధులను నిర్వహిస్తున్నాడు. మంత్రులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ప్రభుత్వ పత్రికా కార్యాలయం తెలిపింది.

ప్రధానమంత్రికి కరోనా సోకడంతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నాడు.  ఐదు రోజుల  క్రితం యూఎస్ అండర్ సెక్రటరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ కీత్ క్రాచ్ కోవిడ్ బారిన పడ్డారు. ఆయనను ప్రధాని కలిశారు.

ఆ తర్వాత బల్గేరియా ప్రధానికి కూడ కరోనా సోకింది.తనకు కరోనా నిర్ధారణ అయిందని ఆయన తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో తెలిపారు.కరోనా కారణంగా తనకు సాదారణంగా అనారోగ్యంగా ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి వైద్యుల అభీష్టం మేరకు ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్టుగా ఆయన చెప్పారు. ఇంటి నుండే విధులను నిర్వహిస్తున్నట్టుగా ఆయన చెప్పారు

గతంలో కూడ పలు దేశాల ప్రధానులు కరోనా బారినపడ్డారు. కరోనా నుండి కోలుకొన్నారు. కరోనా బారిన పడిన తర్వాత ఇంటి  నుండి పలువురు ప్రధానులు విధులు నిర్వహించారు. తాజాగా బల్గేరియా ప్రధాని ఇంటి నుండే విదులు నిర్వహిస్తున్నారు.