తెలుగు నాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ప్రపంచంలో నోస్ట్రా డామస్‌ల మాదిరే బల్గేరియా ప్రజలు కూడా వాంగా బాబా (Bulgarian Baba Vanga) చెప్పిన జోస్యాన్ని అంతే బలంగా నమ్ముతారు. ఈ క్రమంలోనే ఆమె రష్యాపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ‘రష్యా ‘లార్డ్ ఆఫ్ వరల్డ్’గా అవతరించబోతోందని... ఏదో ఒక రోజు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రపంచాన్ని ఏలుతాడని వాంగా బాబా చెప్పారు. 

ఉక్రెయిన్‌‌పై రష్యా యుద్ధం (russia ukraine crisis) నేపథ్యంలో ప్రపంచం పుతిన్‌ను (putin) ఎలా ఆపాలా అని చూస్తోంది. అమెరికా, జర్మనీ, బ్రిటన్‌లు ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అటు యూరోపియన్ యూనియన్ కూడా పుతిన్ ఆస్తులను ఫ్రీజ్ చేసింది. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం తగ్గడం లేదు. ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలని ఆయన రష్యా సేనలను ఆదేశించారు. యుద్ధాన్ని ఆపొద్దని బలగాలకు సూచించారు. మరోవైపు యుద్ధం నేపథ్యంలో నాటో కూటమి కీలక సమావేశం నిర్వహించనుంది. 

అయితే రష్యా యుద్ధాన్ని ఆపదని, అలాగే పుతిన్‌ను ఎవరో అడ్డుకోలేరంటూ ఓ బాబా గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తెలుగు నాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ప్రపంచంలో నోస్ట్రా డామస్‌ల మాదిరే బల్గేరియా ప్రజలు కూడా వాంగా బాబా (Bulgarian Baba Vanga) చెప్పిన జోస్యాన్ని అంతే బలంగా నమ్ముతారు. ఈ క్రమంలోనే ఆమె రష్యాపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ‘రష్యా ‘లార్డ్ ఆఫ్ వరల్డ్’గా అవతరించబోతోందని... ఏదో ఒక రోజు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రపంచాన్ని ఏలుతాడని వాంగా బాబా చెప్పారు. ఆయన్ను ఆపడం ఎవరి తరం కాదని.. యూరప్ బీడు భూమిగా మారబోతోందని జోస్యం చెప్పారు. ప్రపంచంలోని అన్ని విషయాలు మంచు ముక్కలా కరిగిపోతాయని.. కానీ వ్లాదిమిర్ పుతిన్, రష్యా కీర్తిని ఎవరూ టచ్ చేయలేరు అని వాంగా బాబా ఓ రైటర్‌తో చెప్పినట్టు బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ కథనాలు వెలువరించింది. 

1911 జనవరి 31న జన్మించిన వాంగా బాబా.. 12ఏళ్ల వయసులో ప్రకృతి విపత్తు వల్ల కంటిచూపు కోల్పోయారు. ఆ తర్వాత నుంచి భవిష్యత్తు గురించి ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికాలో జరిగిన 9/11 దాడులు, బ్రెగ్జిట్ వంటి విషయాలను కొన్నేళ్ల కిందటే వాంగా బాబా అంచనా వేశారు. అంతేకాకుండా అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్ అమెరికన్ ఎన్నికవుతారని తెలిపారు. ఆమె చెప్పిన విధంగానే బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా వాంగా బాబా చెప్పిన వాటిల్లో 85 శాతం జరగడంతో తాజాగా రష్యా గురించి ఆమె చెప్పిన జోస్యానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

అంతకుముందు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ (volodymyr zelensky) .. భావోద్వేగానికి గురయ్యారు. యుద్ధంలో ఒంటరైపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి ఎలాంటి సాయాన్ని ఆశించవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, తాము మాత్రం రష్యాను చూసి భయపడట్లేదని, పోరాడుతామని, దేశాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. రష్యా దాడికి బెదిరేది లేదంటున్నారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాడిమిర్‌ జెలొంస్కీ. రష్యా దాడులను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ప్రపంచదేశాలు తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్ర‌మంలో 10 రష్యా యుద్దవిమానాలను , హెలికాప్టర్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది. అయితే తాము ఒక్క యుద్ద విమానాన్ని కూడా కోల్పోలేదని ఉక్రెయిన్ అస‌త్య ప్ర‌చారం చేస్తుందని ర‌ష్యా పేర్కొంది.

తాజాగా.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ (Sergey Lavrov) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఉక్రెయిన్ సైన్యం త‌క్ష‌ణ‌మే యుద్దం ఆపాలి. ఉక్రెయిన్ సైన్యం త‌న‌ చేతుల్లోని ఉన్న‌ ఆయుధాల‌ను వ‌దిలేయాలి. ఆపై ర‌ష్యా సైన్యానికి లొంగిపోవాలి. ఉక్రెయిన్ సైన్యం మొత్తం ర‌ష్యా సైన్యానికి లొంగిపోయాలి. ఆ తర్వాత ఉక్రెయిన్ ప్ర‌భుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ చెప్పారు. మ‌రి ఈ ప్ర‌క‌ట‌న‌పై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు ఎలా స్పందిస్తారో చూడాలి.