కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే ప్రస్తుతం దేశ విదేశాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చైనాలోని వుహాన్ పట్టణంలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు చాలా దేశాలకు విస్తరించింది.  భారత్ లోనూ ఒకరిద్దరికి ఈ వైరస్ సోకింది. చైనాలో అయితే.. ఇప్పటి వరకు 400లకు పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ఈ వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అయితే.. ఈ వైరస్ ని వైన్ తో నయం చేయవచ్చంటున్నాడు ఓ బ్రిటీష్ ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. తనకు కేవలం విస్కీ , తెనె తీసుకోవడం వల్ల కరోనా తగ్గిపోయిందని అతను చెబుతుండం విశేషం.

Also Read ఒళ్ళు జలదరించే కరోనా ఫుడ్స్: వామ్మో.. మనం చైనాలో పుట్టలేదు!...

పూర్తి వివరాల్లోకి వెళితే... బ్రిటన్ కి చెందిన కానర్ రీడ్ అనే వ్యక్తి చైనాలోని వుహాన్ లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన కరోనా వైరస్ గురించి ఓ వీడియో విడుదల చేశాడు. రెండు నెలల క్రితం తాను తీవ్రమైన జలుబు, దగ్గు లక్షణాలతో కూడి న ఫ్లూ, న్యుమోనియా తో బాధపడినట్లు చెప్పాడు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళితే.. శరీరంలో వైరస్ ఉందని చెప్పారని అన్నాడు.

తనకు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటే ఆస్పత్రిలో చేరాల్సిందిగా డాక్టర్లు చెప్పారని ఆయన వివరిాచాడు. అయితే.. తాను ఆస్పత్రిలో చేరలేదని.. వాళ్లు ఇచ్చిన మందులను కూడా తిరస్కరించాడట. ఆ తర్వాత తన సొంతవైద్యం ట్రై చేశానని చెబుతున్నాడు.

వ్యాధి నివారణలో భాగంగా ఒక గ్లాసు వెచ్చని విస్కీలో  తేనె కలుపుకొని తాగేవాడినని ఇలా క్రమంగా తీసుకోవడంతో తన ఆరోగ్యం మెరుగైందని చెప్పాడు. ఇప్పుడు తన శరీరంలో వైరస్ లేదని సంతోషంగా చెబుతున్నాడు.

తనకు వచ్చిన జబ్బు.. కరోనా వైరస్ లక్షణాలు ఒకేలా ఉన్నాయని.. అందుకే తనకు కరోనా సోకినట్లే భావిస్తున్నట్లు చెప్పాడు. అదే నిజమైతే కరోనాకి వైన్, తేనెతో నయం చేయవచ్చని చెబుతున్నాడు. కాగా... ఇతని వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

కాగా, మూడేళ్లుగా చైనాలో ఉంటున్నానని తెలిపిన కానర్‌.. ఎప్పుడూ జనసంద్రంగా ఉండే వుహాన్‌ కరోనా వల్ల ఒక్కసారిగా దెయ్యాల నగరంగా మారిందన్నాడు. ఇక్కడి ప్రజలు బయట కాలు పెట్టడానికే జంకుతున్నారని, ఇక ముసుగు లేకుండా బయటకు వస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలిపాడు.