ఓ మహిళ.. మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమెతో సంబంధం కోసం కన్నకొడుకుని అతి కిరాతకంగా హత్య చేసింది.  కొడుకును పొడిచి చంపేసి.. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా చేసి ఆపై బార్బెక్యూలో కాల్చేసింది. ఈ దారుణ సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బ్రెజిల్ కి చెందిన రోసానా ఆరి డా సిల్వా కాండిడో అనే మహిళకు రువాన్ మేకాన్ డా సిల్వా అనే తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా.. రోసానాకి గత కొంతకాలంగా  కాసిలా ప్రిస్సిలా అనే మహిళతో సంబంధం ఏర్పడింది. వీరి సంబంధానికి కొడుకు అడ్డుగా తోచాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి బాలుడిని చంపేశారు.

ఈ ఏడాది మే 31 రాత్రి సమయంలో రువాస్‌ తన ఇంటిలో నిద్రపోతున్నాడు. ఆ సమయంలో మహిళలిద్దరు బాలుడిపై దాడి చేశారు. కాండిడో అతని ఛాతీలో 11 సార్లు పొడిచింది. అనంతరం చిన్నారిని క్రిందికి పడేసింది. అనంతరం ఇద్దరు కలిసి బాలుడిని ముక్కలుగా కట్‌ చేసి.. బార్బెక్యూ గ్రిల్ మీద ఉంచి కాల్చేశారు. 

తరువాత వారు ఆ అవశేషాలను సూట్‌కేస్‌లో నింపి.. సమాంచాయియా ప్రాంతంలో‌ పడేస్తుండగా.. ఇద్దరు యువకులు వారిని గమనించారు. సాక్షులలో ఒకరు, ఉత్సుకతతో, సూట్‌కేస్‌ను తెరిచి చూసి.. దానిలో ఉన్న వాటిని చూసి జడుసుకున్నాడు. సూట్‌కేస్‌లో ఎముకలు వంటివి ఉండటంతో వెంటనే దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దర్యాప్తులో భాగంగా ఇద్దరు మహిళలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. రెండు రోజుల క్రితం కోర్టు వీరికి శిక్ష విధించింది.

ఈ కేసుకు సంబంధించి నవంబర్‌ 25న కోర్టు రువాస్ కి 65 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, ఆమెకు సాయం చేసినందుకు కాసిలా ప్రిస్సిలా కు 64ఏళ్ల జైలు శిక్ష విధించారు.