Asianet News TeluguAsianet News Telugu

37 వేల అడుగుల ఎత్తులో విమానం.. నిద్రలోకి జారుకున్న పైలట్లు.. ల్యాండింగ్ కూడా మిస్.. ఏమైందంటే?

37 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకున్నారు. వారి చేరుకోవాల్సిన గమ్య స్థానం దాటిపోయినా వారు మేలుకోలేదు. చివరకు ఆటో పైలట్ సిస్టమ్ డిస్‌కనెక్ట్ కావడంతో వచ్చిన అలారంతో తటాలున మేల్కొన్నారు. 25 నిమిషాలు ఆలస్యంగానైనా సేఫ్‌గానే ల్యాండ్ అయింది.

both pilots fall asleep while aircraft flying at 37000 feet landing too missed
Author
First Published Aug 19, 2022, 7:15 PM IST

న్యూఢిల్లీ: ఆ విమానం 37 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ఉన్నది. కానీ, ఇద్దరు పైలట్లూ నిద్రలోకి జారుకున్నారు. అది గమ్యస్థానం చేరినప్పటికీ వారు నిద్రలో నుంచి బయట పడలేదు. ల్యాండ్ కావాల్సిన ప్రాంతాన్ని ఆ విమానం దాటి పోయింది. అయినా వారు గాఢ నిద్రలోనే ఉండిపోయారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారిని అలర్ట్ చేయడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ఆ విమానం రన్ వే దాటి పోయకా ఆటో పైలట్ డిస్‌కనెక్ట్ అయింది. ఆ తర్వాత క్యాబినెట్ పెద్దగా అలారం వచ్చింది. అప్పుడు పైలట్లు నిద్ర నుంచి బయటపడ్డారు.

సూడాన్ రాజధాని ఖార్టమ్ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బయల్దేరింది. ఆ ఈటీ 343 విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. వారే విమానం నడుపుతున్నారు. ఎంత దూరం ప్రయాణించారో తెలియదు కానీ, ఆ పైలట్లు నిద్రలోకి జారుకున్నారు. బోయింగ్ 737 విమానం ఆటో పైలట్ సిస్టమ్ అద్భుతంగా పని చేసింది. 37 వేల ఎత్తులో ఆ విమానం సుస్థిరంగా ప్రయాణించడానికి ఈ ఆటో పైలట్ సిస్టమ్ ఉపకరించింది.

ఆ విమానం ల్యాండ్ కావాల్సిన అడిస్ అబాబా ఎయిర్ పోర్టు రానే వచ్చింది. కానీ, పైలట్లు నిద్రలోనే ఉన్నారు. దీంతో ఆ విమానం అలాగే ముందుకు వెళ్లింది. ల్యాండ్ కావాల్సిన విమానం ఆ పొజిషన్ తీసుకోకుండా ముందుకు వెళ్లుతుండటాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గమనించింది. వెంటనే  ఆ ప్లేన్‌ను అలర్ట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ, ఆ ప్రయత్నాలు సఫలం కాలేవు. అయితే, రన్ వే లొకేషన్‌ను దాటి ఆ విమానం ముందుకు వెళ్లగానే ఆటో పైలట్ సిస్టమ్ డిస్‌కనెక్ట్ అయింది. దీంతో విమానంలో అలర్ట్ అలారం వచ్చింది. ఈ అలారంతో పైలట్లు మెలకువలోకి వచ్చారు.

వెంటనే వారు తమ నైపుణ్యాలతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. నిర్దేశిత సమాయాని కంటే 25 నిమిషాలు ఆలస్యంగా ఈ విమానం ల్యాండ్ అయింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ ఘటనను ఏవియేషన్ సర్వెలెన్స్ సిస్టమ్ ఏడీఎస్- బీ కూడా ధ్రువీకరించింది. ఎయిర్ పోర్టుకు చేరిన తర్వాత విమానం దాదాపు ఇన్‌ఫినైట్ సింబల్‌ దాని ప్రయాణం సాగింది.

Follow Us:
Download App:
  • android
  • ios