ప్రార్థనా స్థలంలో ఆత్మాహుతి దాడి, 20 మంది మృతి

bomb blast on afghanistan
Highlights

అప్ఘానిస్థాన్ లో తాలిబన్లు మరోసారి రక్తపాతాన్ని సృష్టించారు. ఓ ప్రార్థనా మందిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడి 20 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ బాంబు పేలుళ్లలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషయమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అప్ఘాన్ అధికారులు వెల్లడించారు. 

అప్ఘాన్ లోని పక్టియా ప్రావిన్స్ లోని గార్డేజ్ సిటీలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇవాళ శుక్రవారం కావడంతో ప్రార్థనలు చేయడానికి మసీదులకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు. దీంతో వీరిని టార్గెట్ గా చేసుకుని ఈ దాడి జరిగింది. అందరు ప్రార్థనలు చేస్తుండగా హటాత్తుగా వారి మధ్యలోకి వెళ్లిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుళ్లలో ఇప్పటివరకు 20 మంది చనిపోయినట్లు సమాచారం. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రస్తుతం సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దాడిలో గాయపడిన క్షతగాత్రుల్లో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అప్ఘాన్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ దాడికి పాల్పడినట్లు ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు.

loader