Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్ లో బాంబ్ బ్లాస్ట్.. ఐదుగురు మృతి, 21 మందికి పైగా గాయాలు

పాకిస్థాన్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో శుక్రవారం బాంబు పేలుడు సంభవించిది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 21 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు. 

Bomb blast in Pakistan.. 5 killed, more than 21 injured..ISR
Author
First Published Nov 3, 2023, 3:25 PM IST

వాయవ్య పాకిస్థాన్ లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. పోలీసులను టార్గెట్ గా చేసుకొని శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. పేలుడు శబ్ధాలు వినిపించడంతో వెంటనే బాంబ్ స్క్వాడ్, లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలో ఈ పేలుడు సంభవించినట్లు వార్తా సంస్థ ‘రాయిటర్స్’ తెలిపింది.

పార్టీ ఆదేశిస్తే కర్ణాటక సీఎం కావడానికి సిద్ధమే - మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే

నగరంలో పోలీసు పెట్రోలింగ్ కు సమీపంలో బాంబు పేలిందని పోలీసు అధికారి మహ్మద్ అద్నాన్ తెలిపారు. ఈ ఘటన ఆత్మాహుతి దాడి వల్ల జరిగిందా ? లేక పక్కా ప్రణాళికతో అమర్చిన బాంబు వల్ల జరిగిందా అనేది స్పష్టంగా తెలియడం లేదని ఆయన అన్నారు. అయితే బాధ్యులు ఎవరన్నది ఇప్పుడే చెప్పలేమని పోలీసులు, రెస్క్యూ అధికారులు తెలిపారు.

కాగా.. డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న గిరిజన జిల్లాల అంచున ఉంది. ఇవి చాలా కాలంగా దేశీయ మరియు విదేశీ ఇస్లామిక్ తీవ్రవాదులకు నిలయంగా ఉన్నాయి. కాగా.. తాజా ప్రమాదంలో గాయపడిన వారందరూ ప్రస్తుతం సమీపంలోని పలు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios