తన ప్రేయసి వేరెవరో పెట్టిన పోస్ట్ కి లైక్ కొట్టిందనే కోపంతో ఓ వ్యక్తి తన ప్రియురాలి కళ్లు పీకేయాలనుకున్నాడు. పీకడానికి ప్రయత్నించాడు కూడా. కానీ ఆమె అదృష్టవశాత్తు తప్పించుకుంది. ఈ సంఘటన యూకేలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...యూకేకి  చెందిన డానీ బ్రిడ్జెస్(35) అనే బాడీ బిల్డర్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెకు కొంచం సోషల్ మీడియాలో ఎక్కువ సేపు గడపడం అలవాటు. కాగా... ఓ వ్యక్తి పెట్టిన పోస్టు బాగా నచ్చడంతో లైక్ కొట్టింది. తన గర్ల్ ఫ్రెండ్ వేరే ఎవరో పెట్టిన పోస్టుకి లైక్ కొట్టడం డానీకి నచ్చేలేదు. అంతే కోపంతో ఊగిపోయాడు. ఆమె కళ్లు పీకేయాలని అనుకున్నాడు. కళ్లు పీకేస్తే ఫేస్ బుక్ వాడటానికి ఉండదు కదా అని అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా ఆమె కళ్లు పీకేయబోయాడు. కాగా అతని నుంచి తప్పించుకున్న ప్రేయసి తన స్నేహితురాలికి మెసేజ్ ద్వారా సమాచారం తెలియజేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. అనంతరం డానీని అరెస్టు చేశారు. ఈ కేసు తాజాగా కాంటర్బరీ క్రౌన్ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. ‘‘అతడు నా కళ్లను బయటకు లాగేస్తున్నట్లు అనిపించింది. గుడ్లు ఊడి బయటకు వచ్చి చచ్చిపోతానేమో అనిపించింది. కళ్ల వద్ద నాకు బలమైన గాయాలయ్యాయి’’ అని తెలిపింది. కాగా.. గతంలో కూడా అతను తనపై దాడి చేసినట్లు ఆమె తెలిపింది.