పాకిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఉదయం పాక్‌లోని చైనా రాయబార కార్యాలయం ఎదుట కాల్పులు, ఆత్మహుతి దాడి జరగ్గా.. మధ్యాహ్నం ఖైబర్ ప్రావిన్సులో భారీ బాంబు పేలుడు సంభవించింది.

హంగులోని ఓరక్‌జాయ్ ప్రాంతంలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది.. దీనిని టార్గెట్‌గా చేసుకున్న ఉగ్రవాదులు రద్దీగా ఉన్న ప్రాంతంలో బాంబు పేల్చారు. ఈ ఘటనలో 25 మంది మరణించగా.. 35 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు.. వెంటే సహాయక చర్యలను చేపట్టాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.