ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కి కాబోయే అల్లుడిని చూశారా..? బిల్ గేట్స్, మెలిండా దంపతుల ముద్దుల కుమార్తె జెన్సిఫర్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. ఇటీవల ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఈజిప్ట్ కి చెందిన గుర్రపు స్వారీ ఆటగాడు నయెల్ నాసర్(29) తో ఇటీవల  జెన్నిఫర్(23) నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని జెన్నిఫర్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది.

ఈ మేరకు మంచకొండల్లో నయెల్ నాసర్ తో కలిసి దిగిన ఫోటోలను జెన్సిఫర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ జీవితంలో ప్రేమను పంచుకుంటూ మందుకు వెళ్తున్నామంటూ ఆమె పేర్కొనడం విశేషం. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.

Also Read కరోనా రోగుల శాడిజం... మిగితా వాళ్లకి కూడా వైరస్ సోకాలని..

జెన్నిఫర్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆమె పోస్ట్‌కు ఇప్పటికే 46వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. పలువురు నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక జెన్నిఫర్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌ పోస్ట్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వెలిబుచ్చారు. 

‘ నేను ఆశ్చర్యానికి గురయ్యాను. అభినందనలు’ అని బిల్‌గేట్స్‌ కామెంట్‌ చేయగా, ‘నిన్ను, నయెల్ నాసర్‌ను జంటగా చూడడం సంతోషంగా ఉంది’ అని మెలిండా గేట్స్‌ ట్వీట్‌ చేశారు. ఇక నయెల్‌ నాసర్‌ కూడా తన నిశ్చితార్థానికి సంబందిన విషయాన్ని ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా తెలిపారు. ‘ చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరేమో’ అంటూ జెన్నిఫర్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేశారు.