వాషింగ్టన్: బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ డైరెక్టర్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ శుక్రవారంనాడు ప్రకటించింది. తన సమయాన్ని గ్లోబల్ హెల్త్, విద్య వంటి సామాజిక సేవలకు వినియోగించే ఉద్దేశంతో ఆయన మైక్రోసాప్ట్ నుంచి తప్పుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

అయితే, ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా మాత్రం కొనసాగుతారు. బిల్ గేట్స్ 1975లో మైక్రోసాఫ్ట్ ను స్థాపించారు. 2000 వరకు కంపెనీ సీఈవోగా కొనసాగారు. వారెన్ బఫెట్ నుంచి కూడా బిల్ గేట్స్ తప్పుకున్నారు. వాతావరణ మార్పులపై కూడా ఆయన దృష్టి పెట్టనున్నారు.  

బిల్ గేట్స్ తప్పుకోవడంతో మైక్రోసాఫ్ట్ బోర్డులో 12 మంది ఉంటారు. గేట్స్ తో కలిసి పనిచేయడం గొప్ప గౌరవమని సత్య నాదెళ్ల అన్నారు. గేట్స్ నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు. సాఫ్ట్ వేర్ శక్తిని ప్రజాస్వామ్యీకరించే ఉద్దేశంతో బిల్ గేట్స్ కంపెనీని స్థాపించారని ఆయన అన్నారు. 

బిల్ గేట్స్ నాయకత్వం, విజన్ తో బోర్డు చాలా లాభపడిందని చెప్పారు. బిల్ గేట్స్ టెక్నికల్ పాషన్ సంస్థకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.