Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో బిల్ గేట్స్ కూతురి సీక్రెట్ వివాహం..!

 తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్‌ రైడర్‌ అయిన నాయెల్‌ నాజర్‌తో జెన్నిఫర్‌ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన ‘పీపుల్‌’ మ్యాగజైన్‌ ధృవీకరించింది. వీరి వివాహం న్యూయార్క్‌లో జరిగినట్లు సదరు మ్యాగజైన్‌ ప్రచురించింది.

Bill Gates' Daughter Jennifer Marries Equestrian Nayel Nassar
Author
Hyderabad, First Published Oct 18, 2021, 10:07 AM IST

ప్రపంచ కుబేరులు ఎవరు అనగానే ముందుగా  బిల్ గేట్స్ పేరు వినపడుతోంది. అంతటి కుబేరుడి కుమార్తె పెళ్లంటే ఎంత అంగరంగ వైభవంగా  జరగాలి..? కానీ.. ఆయన కుమార్తె జెన్నిఫర్ మాత్రం సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుంది.

 బిల్ గేట్స్- మిలిందా కుమార్తె జెన్నీఫర్ కేథరిన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. జెన్నీఫర్..  సీక్రెట్ గా తన ప్రియుడిని పెళ్లి చేసుకుందని సమాచారం.  తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్‌ రైడర్‌ అయిన నాయెల్‌ నాజర్‌తో జెన్నిఫర్‌ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన ‘పీపుల్‌’ మ్యాగజైన్‌ ధృవీకరించింది. వీరి వివాహం న్యూయార్క్‌లో జరిగినట్లు సదరు మ్యాగజైన్‌ ప్రచురించింది.

 

కొన్ని నెలల క్రితం మిలిందా గేట్స్‌తో విడాకులు తీసుకున్న బిల్‌గేట్స్‌.. కుమార్తె జెన్నీఫర్‌ వివాహ వేడుకకు ఒకరోజు ముందుగా హాజరయ్యారు.  కాగా, కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు.  అతికొద్ది మంది బంధువుల సమక్షంలోనే జెన్నీఫర్‌-నాజర్‌ల పెళ్లి జరిగినట్లు పీపుల్‌ మ్యాగజైన్‌ స్పష్టం చేసింది.

ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా తరఫున నాజర్‌ ఈక్వెస్ట్రియన్‌(గుర్రపు స్వారీ)లో పాల్గొన్నాడు.  ఈజిప్టు సంతతికి చెందిన నాయల్‌ నాజర్‌ది సంపన్న కుటుంబమే.  వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్‌లో ఉన్నారట. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో వీరిద్దరి కలిసి చదువుకుంటున్న సమయంలో ప్రేమ చిగురించింది.  చివరకు సోషల్‌ మీడియా వేదికగా జెన్నీఫర్‌ తన ప్రేమ వివాహాన్ని గతేడాదే బైటపెట్టింది. ఆ సమయంలో వీరి ప్రేమకు బిల్‌గేట్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. దానిలో భాగంగానే వీరి పెళ్లికి బిల్‌గేట్స్‌తో పాటు మాజీ భార్య మిలిందాలు దగ్గరుండి జరిపించినట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios