Asianet News TeluguAsianet News Telugu

అమెరికన్ ఫస్ట్ లేడీ బర్త్.. బైడెన్ స్పెషల్ ట్రీట్..!

డెలావేర్​లోని తమ రెహోబోత్​ బీచ్​ హౌస్​లో దంపతులిద్దరూ స‌ర‌దాగా సైక్లింగ్ చేస్తూ బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకున్నారు. 
 

Bidens celebrate first lady's birthday at her favorite place
Author
hyderabad, First Published Jun 4, 2021, 3:18 PM IST

అమెరికా అధ్యక్షుడుడ జో బైడెన్  భార్య, అమెరికన్ ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. కాగా.. ఈ సందర్భంగా బైడెన్ తన భార్య జిల్ బైడెన్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.

జిల్ బ‌ర్త్‌డేను సైకిల్ స‌వారీతో సెల‌బ్రేట్ చేశారు. గురువారం అమెరికా ప్ర‌థ‌మ మ‌హిళ జిల్ బైడెన్‌ 70వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డెలావేర్​లోని తమ రెహోబోత్​ బీచ్​ హౌస్​లో దంపతులిద్దరూ స‌ర‌దాగా సైక్లింగ్ చేస్తూ బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకున్నారు. 

ఇలా ఈ దంప‌తులిద్ద‌రూ సైకిల్ రైడ్ కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో మ‌ధ్య‌లో కొంద‌రు పాద‌చారులు జిల్‌కు బ‌ర్త్‌డే విషెష్ చెబుతూ హ్యాపీ బ‌ర్త్‌డే పాట‌ను ఆల‌పించారు. దాంతో త‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్షలు చెప్పిన వారికి ఫ‌స్ట్ లేడీ థ్యాంక్స్ చెప్పారు.

 బైడెన్‌, జిల్ సైకిల్ రైడ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ‌ వైర‌ల్ అవుతోంది. కాగా, అగ్రరాజ్యం చ‌రిత్ర‌లోనే అత్యంత పెద్ద వ‌య‌స్కురాలైన ప్ర‌థ‌మ మ‌హిళ‌గా జిల్ బైడెన్ చ‌రిత్ర‌కెక్కిన‌ విష‌యం తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios