Russia Ukraine Crisis: అమెరికాలో నివాసం ఉంటున్న ఉక్రెయిన్లకు బైడెన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఇమ్మిగ్రేషన్ గడుపు పొడిగిస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో చిక్కుకుపోయిన వేలాది ఉక్రెయిన్లకు ఊరట లభించింది.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా బలాగాలు భీకర దాడి చేస్తున్నాయి. గత వారం రోజులుగా.. ఉక్రెయిన్ నగరాలపై మిస్సైల్స్, బాంబులతో విరుచుకుపడున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు ఖార్కీవ్‌పైనా రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఖార్కీవ్ లో జరిగిన దాడుల్లో 21 మంది మృతి చెందారు. 112 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతితో పెట్టకుని కాలం వెల్లాదీస్తున్నారు. గత వారం రోజులుగా రష్యా చేస్తున్న దాడుల్లో భారీగానే ప్రాణ నష్టం సంభవించింది. ఎటు చూసినా శవాలు గుట్టు గుట్టులు దర్శనమిస్తున్నాయి. రష్యా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 2వేల మంది ఉక్రెయిన్ వాసులు మృతి చెందినట్టు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికారికంగా వెల్లడించింది. ఇదే సమయంలో లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజలు స్వదేశం విడిచి.. పారిపోతున్నారని తెలిపింది
ఇదిలా ఉంటే..అమెరికాలో నివాసం ఉంటున్న ఉక్రెయిన్లకు బైడెన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఇమ్మిగ్రేషన్ గడుపు పొడిగిస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో చిక్కుకుపోయిన వేలాది ఉక్రెయిన్లకు ఊరట లభించింది. ఈ విపత్తకర్క పరిసిత్తుల్లో హెచ్-1బి వీసా వచ్చిన వారు మరికొంత కాలం అక్కడే ఉండేందుకు వీలు కల్పించింది.
వచ్చే 18 నెలల పాటు దేశంలోని ఉక్రెయిన్‌వాసులకు ‘తాత్కాలిక రక్షిత హోదా’ కల్పిస్తున్నట్లు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) గురువారం ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న ఉక్రేనియన్‌లను ఇక్కడే ఉండటానికి అనుమతి వచ్చింది. ఇమ్మిగ్రేషన్ గడువు ముగిసిన వారికి బహిష్కరణ ముప్పు తప్పింది.
ఈ నేపథ్యంలో హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా ఖండించారు. తెలివిలేని హింసాత్మక చర్యగా పరిగణించారు. రష్యా దుశ్చర్య కారణంగా లక్షలాది మంది ఉక్రేనియన్లు ఇతర దేశాలలో ఆశ్రయం పొందవలసి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ అసాధారణ సమయాల్లో.. యునైటెడ్ స్టేట్స్‌లోని ఉక్రేనియన్ జాతీయులకు తమ మద్దతు, రక్షణను అందిస్తామని తెలిపారు. మార్చి 1, 2022 కంటే ముందు అమెరికాలో ఉన్న ఉక్రేనియన్లకు మాత్రమే తాత్కాలిక రక్షిత హోదా కల్పించబడుతుందని DHS తెలిపింది. మార్చి 1, 2022 తర్వాత యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లడానికి ప్రయత్నించే వ్యక్తులు TPSకి అర్హులు కారని DHS తెలిపింది.
దాదాపు 30,000 మంది ఉక్రేనియన్ల వీసా గడువు ముగిసిన ముగిసిపోయిదని వాల్ స్ట్రీట్ జర్నల్ గణాంకాలు తెలుతున్నాయి. ప్రస్తుతం 4,000 మంది ఉక్రేనియన్లు బహిష్కరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని సిరక్యూస్ విశ్వవిద్యాలయం నిర్వహించే డేటాబేస్ తెలుపుతోంది.
