హమ్మయ్య...!! బెర్ముడా చిక్కుముడి వీడింది

bermuda traingle mystery solved
Highlights

నాగరిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనిషి ఎంత అభివృద్ధి సాధిస్తున్నా.... రోదసిలోకి కాలు మోపుతున్నా మనిషి మేధస్సుకు అందని చిక్కుముడులు ఎన్నో ఉన్నాయి. ఆ పజిల్‌ను విప్పేందుకు కొన్ని కోట్లు రూపాయలు ఖర్చు పెట్టారు.. పెడుతున్నారు కూడా

నాగరిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనిషి ఎంత అభివృద్ధి సాధిస్తున్నా.... రోదసిలోకి కాలు మోపుతున్నా మనిషి మేధస్సుకు అందని చిక్కుముడులు ఎన్నో ఉన్నాయి. ఆ పజిల్‌ను విప్పేందుకు కొన్ని కోట్లు రూపాయలు ఖర్చు పెట్టారు.. పెడుతున్నారు కూడా.. కానీ ఇంత వరకు ఆ ప్రాంతంలో ఏం జరుగుతోంది. వందల ఏళ్లుగా నౌకలు, విమానాలు ఆ ప్రాంతంలో ఎందుకు మాయమవుతున్నాయన్నది మాత్రం కనిపెట్టేలేదు.

అట్లాంటిక్ మహాసముద్రంలోని మయామి.. సాన్ యువాన్.. ఫ్యూక్టోరికో మధ్యలో ట్రయాంగిల్ ఆకారంలోని ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. దీని మొత్తం విస్తీర్ణం 7 లక్షల చదరపు కిలోమీటర్లు. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రయాణించే ఓడలు.. విమానాలు మాయమవుతున్నాయి. వీటి శిథిలాల కోసం ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఎక్కడా లభించలేదు. దాదాపు వందేళ్ల నుంచి 75 విమానాలు, లెక్కలేనన్ని ఓడలు అక్కడ కనిపించకుండా పోయాయి.

మృత్యువుకు కేరాఫ్‌గా.. ఓడలకు, విమానాలకు మరణశాసనంగా.. మిస్టరీ ప్రదేశంగా వార్తల్లోకి ఎక్కిన బెర్ముడా ట్రయాంగిల్ గురించి హాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ ప్రాంతం గురించి అనేక కథనాలు, కథలు ప్రచారంలోకి వచ్చాయి.. సముద్రంలో ఉండే పిరమిడ్లు కారణమని.. గ్రహాంతరవాసులు వీటిని మాయం చేస్తున్నారని.. బ్లాక్ హోల్స్ ఉన్నాయని ఇలా ఎవరికి నచ్చినట్లు వారు కథనాలు అల్లేస్తూ వచ్చారు.

అయితే అసలు నిజం వేరే వుందని తేలింది. ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్.. ఛానెల్ 5 చేసిన ప్రయోగంలో ఇన్ని అనర్థాలకు కారణం ‘‘అలలు’’ అని తేలిసింది. అలలా అని మీరు తక్కువగా తీసేయకండి.. మహా సముద్రాల్లో అలలంటే తీరంలో లాగా సాదాసీదాగా ఉండవు.. కనీసం 100 అడుగుల మేర ఎగిసే పడే ‘‘రాకాసి అలలే’’ ఈ ప్రమాదాలకు కారణమని తేల్చింది.. వీటికి ‘‘రోగ్ వేవ్స్’’ అని పేరు కూడా పెట్టింది. ఒకదాని వెంట మరొకటి.. అత్యంత వేగంగా వేరు వేరు దిశల నుంచి వచ్చే ఈ రాకాసి అలలను తప్పించుకోవడం అసాధ్యమని... దాని నుంచి బయటపడే లోపే అపారనష్టం జరుగుతుందని.. ఈ భిన్నమైన పరిస్థితుల వల్లే బెర్ముడా ట్రయాంగిల్‌లో ఓడలు మునిగిపోయాంటున్నారు  శాస్త్రవేత్తలు.

loader