Asianet News TeluguAsianet News Telugu

ఫైజర్ వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తి ముఖానికి పక్షవాతం.. !

మొదటి డోసు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న 61సంవత్సరాల వ్యక్తికి.. ముఖానికి ఎడమవైపు ఇబ్బంది వచ్చినట్లు గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా దాన్ని బెల్స్ పాల్సీ గా వైద్యులు నిర్థారించారు. దీనికి చికిత్స అందించారు. అయితే కోలుకున్న తరువాత కొద్ది రోజులకు రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవడంతో ఈ వ్యాధి మరింత ముదిరింది.

Bells Palsy after second dose of Pfizer COVID-19 vaccination in a patient in UK - bsb
Author
Hyderabad, First Published Jul 20, 2021, 12:03 PM IST

లండన్ : కరోనా నుంచి రక్షణ కోసం తీసుకుంటున్న వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్స్ రావడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఫైజర్ వ్యాక్సిన్ వల్ల ఒక వ్యక్తికి బెల్స్ పాల్సీ (ముఖ పక్షవాతం) వచ్చింది. ఈ ఘటన యూకేలో వెలుగు చూసింది. 

మొదటి డోసు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న 61సంవత్సరాల వ్యక్తికి.. ముఖానికి ఎడమవైపు ఇబ్బంది వచ్చినట్లు గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా దాన్ని బెల్స్ పాల్సీ గా వైద్యులు నిర్థారించారు. దీనికి చికిత్స అందించారు. అయితే కోలుకున్న తరువాత కొద్ది రోజులకు రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవడంతో ఈ వ్యాధి మరింత ముదిరింది.

ఆహారం మింగాలన్నా, ఎడమ కన్ను మూయాలన్నీ కూడా కష్టంగా మారింది. మరోసారి ఆస్పత్రి తలుపులు తట్టగా చికిత్స చేసిన వైద్యులు.. ఈ వ్యక్తికి ఇలా జరగడానికి ఫైజర్ వ్యాక్సినే కారణమని తేల్చారు. అయితే ఇటీవల ఫైజర్ వ్యాక్సిన్ మీద చేసిన ఓ అద్యయనంలో ఇలా బెల్స్ పాల్సీ (ముఖ పక్షవాతం) వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం చాలా అరుదుగా సంభవిస్తుందని తేలింది. కేవలం 0.02 శాతం మందిలో మాత్రమే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఈ పరిశోధనలో వెల్లడయింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios