Russia Ukraine Crisis: ప్ర‌ముఖ న్యూస్ చాన‌ల్ BBC సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మీడియాపై ఆంక్ష‌లు విధించేలా తీసుక‌వ‌చ్చిన కొత్త చట్టాన్ని స్వాగతించ‌డం లేనిద‌నీ,  స్వతంత్ర జర్నలిజం ప్రక్రియను నేరంగా పరిగణించేలా కనిపిస్తోందని, ఈ మేర‌కు త‌న ప్ర‌సారాల‌ను నిలిపివేసిన‌ట్టు అని BBC డైరెక్టర్ జనరల్  తెలిపారు. 

Russia Ukraine Crisis:  ఉక్రెయిన్, రష్యా మధ్య బీకర పోరు కొనసాగుతూనే ఉంది. తొమ్మిది రోజులుగా బాంబులు, కాల్పులతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది. ఉక్రెయిన్‌పై దాడి ప్రభావం ర‌ష్యాపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే అమెరికా,బ్రిట‌న్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉక్రెయిన్‌ బాసటగా నిలవడంతో పాటు రష్యాపై ఆంక్షల‌ విధిస్తున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడిని వ్య‌తిరేకిస్తూ.. స్వ‌దేశంలోనూ నిర‌స‌న‌లు వెల్లువెత్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని కవర్ చేసేందుకు రష్యా ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ వార్త‌లను ప్ర‌చారం చేయ‌కుండా ఆంక్షాలు విధించింది. ఈ త‌రుణంలో రష్యాకు చెందిన 'టీవీ రెయిన్' చానల్ సిబ్బంది ప్ర‌భుత్వం ఆంక్షాల‌ను నిర‌సిస్తూ.. త‌మ ఉద్యోగాలకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఆ చానల్ సిబ్బంది చివరగా యుద్ధం వద్దు అనే ప్రకటనతో ప్రసారాల‌ను నిలిపివేశారు.

ఉక్రెయిన్ యుద్ధాన్ని కవర్ చేసేందుకు రష్యా ప్రభుత్వం అంగీకరించలేదు. అంతేకాదు, ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రపంచానికి చూపిస్తోందన్న కారణంతో ప‌లు చానల్ ప్రసారాలను నిలిపివేసింది. ఈ మేర‌కు ర‌ష్యా ప్ర‌భుత్వం ఓ చ‌ట్టాన్ని తీసుకవ‌చ్చింది. ఈ చ‌ట్టానికి నిర‌స‌న‌గా.. ప్ర‌ముఖ న్యూస్ చాన‌ల్ BBC .. తాత్కాలికంగా త‌న ప్ర‌సారాల‌ను నిలిపివేసింది. BBC డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. మీడియాపై ఆంక్ష‌లు విధించేలా తీసుక‌వ‌చ్చిన కొత్త చట్టాన్ని స్వాగతించ‌డం లేనిద‌నీ, స్వతంత్ర జర్నలిజం ప్రక్రియను నేరంగా పరిగణించేలా కనిపిస్తోందని అని అన్నారు.

మిలిటరీకి సంబంధించిన తప్పుడు సమాచారం ప్రచురించే మీడియాపై జైలు శిక్ష విధించడాన్ని ర‌ష్యా సమర్థించడంతో రష్యాలోని తమ జర్నలిస్టుల తాత్కాలికంగా విధుల‌ను బ‌హిష్క‌రించిన‌ట్ఉట BBC తెలిపింది. ఈ అవాంఛనీయ పరిణామం ప్రభావాలను తాము అంచ‌నా వేయ‌గ‌ల‌మ‌నీ, నూత‌న చ‌ట్టానికి నిర‌స‌న‌గా రష్యన్ ఫెడరేషన్‌లోని BBC న్యూస్ జర్నలిస్టులందరూ తాత్కాలికంగా త‌మ సేవ‌ల‌ను నిలిపివేయడం కంటే వేరే మార్గం లేదని చెప్పారు.

రష్యన్ భాషలో కాకుండా ఇత‌ర భాష‌ల్లో BBC న్యూస్ ప్ర‌సారాలు రష్యా వెలుపలి నుండి కొనసాగిస్తుందని డేవి చెప్పారు. గత వారంలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడంపై BBC కంటెంట్‌కు డిమాండ్ పెరిగిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. యుద్ద వాతావ‌ర‌ణంలోని విశేషాల‌ను తెలుసుకోవ‌డానికి రష్యన్ భాషా వార్తల వెబ్‌సైట్ల‌కు డిమాండ్ పెరిగింది. సైట్ల యూజ‌ర్ షిప్ కూడా గ‌ణ‌నీయంగా పెరిగింది. BBC .. వారపు సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా పెరిగింది. గత ఏడు రోజుల్లో 10.7 మిలియన్లకు చేరుకున్న‌ట్టు స‌మాచారం.

అలాగే.. ఆంగ్లంలో, రష్యాన్ భాష‌ల్లో bbc.com సైట్ల‌ను సందర్శకుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. దాదాపు 252 శాతం పెరిగి 423,000కి చేరుకున్నారని బ్రాడ్‌కాస్టర్ చెప్పారు. అలాగే.. BBC రేడియోను స్వీకరించడానికి ఉక్రెయిన్‌లో మరిన్ని షార్ట్‌వేవ్ ఫ్రీక్వెన్సీలను అందుబాటులోకి తెచ్చింది. ర‌ష్యా తీసుక‌వ‌చ్చిన నూత‌న చట్టం రష్యన్ జర్నలిస్టులను మాత్రమే కాకుండా విదేశీయులను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని డేవి చెప్పారు.