Asianet News TeluguAsianet News Telugu

నన్ను ‘ఆ మాట..’ అన్నాడని వాడి ముక్కు పగలగొట్టాను.. ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం నాడు ఓ సమావేశంలో మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో తానో స్నేహితుడి ముక్కు పగల గొట్టానని చెప్పుకొచ్చారు. లాకర్ రూం కు సంబంధించిన జరిగిన గొడవలో జాతిని ఉద్దేశించిన మాట్లాడినందుకు తాను అలా చేశానన్నారు. 

Barack Obama Says He Once Broke A Friend's Nose For Using Racial Slur - bsb
Author
Hyderabad, First Published Feb 24, 2021, 11:49 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం నాడు ఓ సమావేశంలో మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో తానో స్నేహితుడి ముక్కు పగల గొట్టానని చెప్పుకొచ్చారు. లాకర్ రూం కు సంబంధించిన జరిగిన గొడవలో జాతిని ఉద్దేశించిన మాట్లాడినందుకు తాను అలా చేశానన్నారు. 

సోమవారం యుఎస్ 44 వ ప్రెసిడెంట్ తన స్పాటిఫై పోడ్కాస్ట్  ఎపిసోడ్లో బ్రూస్ స్ప్రింగ్స్టీన్, "రెనెగేడ్స్" తో ఈ విషయాన్ని పంచుకున్నారని ది హిల్ తెలిపింది. 

ఒబామా మాట్లాడుతూ.. ‘వినండి, నేను పాఠశాలలో ఉన్నప్పుడు నాకో స్నేహితుడు ఉండేవాడు, మేము కలిసి బాస్కెట్‌బాల్ ఆడేవాళ్లం" అని ఒబామా "బోర్న్ ఇన్ ది యుఎస్‌ఎ" గాయకుడితో జాత్యంహకారం మీద జరిగిన విస్తృతమైన సంభాషణలో చెప్పుకొచ్చారు. 

అయితే మేమోసారి గొడవపడ్డాం. అతను స్నేహితుడని కూడా చూడకుండా నన్ను.. నా జాతి పేరుతో పిలిచాడు అని చెప్పుకొచ్చారు. ఒబామా ఈ విషయానికి సంబంధించిన డిటైల్స్ ను 13 నిమిషాల పాటు వివరించారని హిల్ చెప్పుకొచ్చింది. అంతేకాదు హవాయిలో సి --- లు లేవు, కరెక్టే కదా? అన్నారు.

అయితే ఇది వాడిన స్నేహితుడికి అసలు ఆ పదానికి అర్థం కూడా తెలియకపోవచ్చు. కానీ ఆ పదం వల్ల నేను బాధపడతాను అనే విషయం మాత్రం తెలుసు. అందుకే వాడాడు అని ఒబామా అన్నారు. అయితే నేను ఊరుకోలేదు. మొహం మీద ఒక్కటిచ్చా. దెబ్బకు ముక్కు విరిగింది. అప్పుడు మేము లాకర్ రూంలో ఉన్నాం. అంటూ యుఎస్ మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఇది విన్న స్ప్రింగ్స్టీన్ బాగా చేశారు అని వ్యాఖ్యానించాడు.

ఆ తరువాత నేనతనికి ఆ పదం గురించి వివరించాను. ఇంకెప్పుడూ నన్ను అలా పిలవద్దని చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటనను బహిరంగంగా ఒబామా చెప్పడం ఇదే మొదటి సారని హిల్ పేర్కొంది. 

జాతి దురహంకారంతో ఇతరులమీద దాడి చేయడం గురించి ఒబామా మాట్లాడుతూ.. ‘నేను పేదవాడిని కావచ్చు, నేను అజ్ఞానిని కావచ్చు. నేను వికారంగా ఉండొచ్చు, అసహ్యంగా ఉండొచ్చు. నాను నేను కూడా నచ్చకపోవచ్చు. నేను సంతోషంగా లేకపోవచ్చు.. కానీ నేను ఏమీ కాలేనని మీకెలా తెలసు? అని ఒబామా అనగానే స్ప్రింగ్స్టీన్ ‘నేను మీలా కాదు’ అంటూ చెప్పుకొచ్చారు. 

బేసిక్ సైకాలజీ ప్రకారం ఒకరిమీద జాతిని ఉద్దేశించి అమానుషంగా ప్రవర్తించడం తీవ్రమైన నేరం అని హిల్ ఒబామాను ఉటంకిస్తూ చెప్పారు. అదెలాంటిదైనా చివరికి వచ్చేసరికి అక్కడికే దారి తీస్తుంది. కొన్ని సందర్బాల్లో ఇలా వ్యవరించడం చాలా సులభం  అంటూ ఓబామా.. ఇంకా ఇలా చెప్పుకొచ్చారు.. మనకు ప్రాధాన్యత లేదని, అంత ముఖ్యమైన వాళ్లం కాదమే బాధనుండి కూడా.. ఇది వస్తుంది. ఇదే నాకు ప్రాముఖ్యతను సంతరించిపెడుతుంది. 

యుఎస్ ప్రెసిడెంట్ గా అధికార నివాసాన్ని ఒదిలిపెట్టినప్పటినుంచి అమెరికన్ సమాజంపై జాత్యహంకారం ప్రభావం గురించి ఒబామా పదేపదే చర్చించారు. 2015 లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒబామ మాట్లాడుతూ అమెరికా ఇంకా జాత్యహంకారం నుంచి బయటపడలేదని చెప్పుకొచ్చారు. దక్షిణ కెరొలినాలోని చారిత్రాత్మక బ్లాక్ చర్చిలో జరిగిన ఘోరమైన కాల్పుల తరువాత చేసిన తన వ్యాఖ్యలలో, ఒబామా ఇలా చెప్పుకొచ్చారు. అయితే ఈ పదాలను బహిరంగంగా చెప్పడం మర్యాదగా ఉండకపోవచ్చు అన్నారని, ది హిల్ నివేదించింది.

"జాత్యహంకారం ఇప్పటికీ ఉందా, లేదా అనేది కొలత కాదు. ఇది కేవలం బహిరంగ వివక్షకు సంబంధించిన విషయం కాదు. 200 - 300 సంవత్సరాల నుండి ఉన్న చిన్నచూపు ఒక్కరాత్రిలో తుడిచిపెట్టుకుపోదు.. అని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios