ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో శుక్రవారం నాడు జరిగిన ఓ బాంబు దాడిలో 70 మంది మృత్యువాత పడ్డారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని  బూచిస్తాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం నాడు ఓ మోటార్ సైకిల్ లో అమర్చి బాంబును పేల్చారు. 

బీఏపీ   ఎన్నికల ర్యాలీ కి సమీపంలోనే  ఈ పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో బీఏపీ   అభ్యర్ధి సిరాజ్ తో పాటు  మరో20 మంది మృత్యువాత పడ్డారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పిరాజ్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన మరణించినట్గుగా వైద్యులు ప్రకటించినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. సిరాజ్ బలూచిస్తాన్ అవామీ పార్టీ అభ్యర్ధిగా పీబీ -35 స్థానం నుండి బరిలో నిలిచాడు. 2011లో సిరాజ్ కొడుకు ఉగ్రవాదుల దాడిలో మృత్యువాత పడ్డారు. ఇవాళ ఉగ్రవాదుల బాంబుదాడిలో ఆయన మరణించాడు.