బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఆ దేశంలో అల్లర్లు తీవ్ర స్థాయిలో చెలరేగుతున్న నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి వైదొలిగిన హసీనా.. దేశాన్ని వీడినట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక, రాజకీయ సంక్షోభాల కారణంగా దేశంలో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం దేశంలో రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. ఆ దేశంలో అల్లర్లు తీవ్ర స్థాయిలో చెలరేగుతున్న నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి వైదొలిగిన హసీనా.. దేశాన్ని వీడినట్లు సమాచారం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బంగ్లాదేశ్‌లోని స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో అశాంతి, ఆమె పరిపాలనపై పెరుగుతున్న ఒత్తిడి మధ్య ఢాకా ప్యాలెస్‌ను వీడిన ఆమె.. సురక్షితమైన ప్రదేశానికి బయలుదేరారు. కాగా, హసీనా భారత్‌కి వచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.