Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాదేశ్ లో వారం రోజులపాటు పూర్తిగా లాక్ డౌన్

ప్రభుత్వ పాలన శాఖ మంత్రి ఫర్హాద్ హుస్సేన్ ‘ఢాకా ట్రిబ్యూన్’తో మాట్లాడుతూ, అష్ట దిగ్బంధనం సమయంలో అన్ని కార్యాలయాలు, కోర్టులు మూతపడతాయని చెప్పారు.

Bangladesh goes into full lockdown for a week from Monday
Author
Hyderabad, First Published Apr 3, 2021, 2:16 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో... బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేయడానికి సిద్ధమైంది. వారం రోజులపాటు పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 5 నుంచి దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన రంగం మినహా మిగిలిన అన్ని రంగాలను మూసివేయాలని ఆదేశించబోతోంది. ఈ వివరాలను అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ, రోడ్డు రవాణా శాఖ మంత్రి ఒబెయిదుల్ కాదర్ తెలిపారని ‘ఢాకా ట్రిబ్యూన్’ వెల్లడించింది. కాదర్ కూడా తన అధికారిక నివాసంలో మీడియాకు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 

ప్రభుత్వ పాలన శాఖ మంత్రి ఫర్హాద్ హుస్సేన్ ‘ఢాకా ట్రిబ్యూన్’తో మాట్లాడుతూ, అష్ట దిగ్బంధనం సమయంలో అన్ని కార్యాలయాలు, కోర్టులు మూతపడతాయని చెప్పారు. పరిశ్రమలు, మిల్లులు మాత్రమే రొటేషన్ పద్ధతిలో కార్యకలాపాలు నిర్వహిస్తాయని చెప్పారు. అష్ట దిగ్బంధనం సమయంలో పరిశ్రమలను, మిల్లులను ఎందుకు పని చేయనిస్తున్నారని విలేకర్లు అడిగినపుడు ఫర్హాద్ మాట్లాడుతూ, వీటిని మూసేస్తే వర్కర్స్ తాము పని చేసే ప్రదేశాల నుంచి తమ ఇళ్ళకు వెళ్ళిపోవలసి వస్తుందన్నారు. 

బంగ్లాదేశ్‌లో శుక్రవారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో కొత్తగా 6,830 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో ఇన్ఫెక్షన్ రేటు 23.28 శాతం. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 6,24,594.

Follow Us:
Download App:
  • android
  • ios