కోవిడ్ 19 టీకా తీసుకునేందుకు అన్ని దేశాల్లోనూ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. 

ఈ సందర్భంగా హమద్ మాట్లాడుతూ... కరోనా పట్ల  బహ్రెయిన్ సమాజం అప్రమత్తత భేష్ అన్నారు. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన కొవిడ్ నిబంధనలను బహ్రెయిన్ ప్రజలు చక్కగా పాటించారని ప్రశంసించారు. 

దేశంలో మహమ్మారి అదుపులో ఉందంటే దానికి ప్రజలు పాటించిన భద్రతా ప్రమాణాలే కారణమని కొనియాడారు. ఈ సందర్భంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కూడా హమద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 

త్వరలోనే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభిస్తామని కింగ్ తెలిపారు. కాగా, బ్రిటన్ తర్వాత ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపిన రెండో దేశంగా బహ్రెయిన్ నిలిచిన సంగతి తెలిసిందే.