Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ న్యూస్.. పుట్టిన రెండు గంటలకే పిల్లాడికి గుండె పోటు

అప్పుడే పుట్టిన బిడ్డకి కూడా హార్ట్ ఎటాక్ వచ్చింది.  ఈ షాకింగ్ ఘటన యూకేలో చోటుచేసుకుంది. 

Baby boy suffers stroke just two hours after birth, survives

సాధారణంగా గుండెపోటు ఏ వయసు వారికి వస్తుంది..? 60ఏళ్లు దాటిన వారికి వస్తుంది. ఈ మధ్యకాలంలో నిద్రలేమి, పని ఒత్తిడి తదితర  కారణాల వల్ల 30 ఏళ్లు దాటిన వారికి కూడా వస్తూనే ఉన్నాయి. కానీ.. అప్పుడే పుట్టిన బిడ్డకి కూడా హార్ట్ ఎటాక్ వచ్చింది.  ఈ షాకింగ్ ఘటన యూకేలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... యూకే గతేడాది డిసెంబర్ లో జేమ్స్ అనే బాబు జన్మించాడు. పుట్టిన రెండు గంటలకే ఆ బాబుకి గుండె నొప్పి రావడం గమనార్హం. దీంతో అప్రమత్తమైన వైద్యులు బాబుని మూడురోజులపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రతి నిమిషం జాగ్రత్తగా చూసుకుంటూ వైద్యం అందించడంతో ఆ బాలుడు బతికి బయటపడ్డాడు.

బాబు బతుకుతాడని ఎవరూ అనుకోలేదట. బాలుడి తల్లిదండ్రులైతే ఆశలు కూడా వదులుకున్నారట. కానీ.. చివరకు బాలుడు మృత్యుంజయుడయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios