Asianet News TeluguAsianet News Telugu

టాయ్ లెట్ లో కొండ చిలువ.. ఆ ప్లేస్ లో కాటు వేసి..!

వెంటనే ఏంటా అని అనుమానంతో చూడగా..  కొండ చిలువ కనపడింది. దీంతో భయంతో వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు.
 

Austrian man bitten by python during visit to the toilet
Author
Hyderabad, First Published Jul 7, 2021, 10:22 AM IST

పాము అంటే భయపడని వారు చాలా అరుదుగా ఉంటారు. చాలా మంది పాము పేరు చెబితేనే భయంతో వణికి పోతారు. అలాంటిది.. ఆ పాము మన ఇంట్లోకి దూరితే.. ఇలాంటి సంఘటనే ఓ వ్యక్తికి ఎదురైంది. అది కూడా.. ఆ పాము.. టాయ్ లెట్ లో దూరింది. అది చూసుకోకుండా.. ఆయన టాయ్ లెట్ లో కూర్చోగా.. అది కాస్త ఆయనను కాటు వేసింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాన్బెర్రాలోని గ్రాజ్ లో ఓ 65ఏళ్ల వృద్ధుడు ఉదయాన్నే టాయ్ లెట్ కి మలమూత్ర విసర్జన కోసం వెళ్లాడు. ఈ క్రమంలో.. ఆయనను ఏదో కరిచినట్లుగా అనిపించింది. వెంటనే ఏంటా అని అనుమానంతో చూడగా..  కొండ చిలువ కనపడింది. దీంతో భయంతో వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు.

ఆ తర్వాత జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే, తన ఇంటిపక్కన ఉండే 24 ఏళ్ల యువకుడు కొండ చిలువల్ని, పాములను పెంచుతున్నాడని గుర్తించారు. అతని అపార్ట్‌ మెంట్లో  దాదాపు 11 రకాల విషపూరిత పాములు ఉన్నాయని పోలీసులు కనుగొన్నారు. అయితే, ఈ కొండ చిలువ కాటుతో ప్రాణానికి పెద్దగా ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు.  ఆ వృద్ధుడిని, కాటు వేసిన కొండ చిలువ కొన్ని రోజుల ముందు తప్పిపోయిందని ఆ యువకుడు విచారణలో తెలిపాడు.

కొండ చిలువ బాత్రూంలో కాటువేసిన తర్వాత అది కాలువ లోనికి వెళ్లి తప్పించుకుంది.ఆ యువకుడు నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వెంటనే పాములను పట్టేవారికి సమాచారం అందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios