Australian Prime Minister: ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Australian Prime Minister: కరోనావైరస్ మహమ్మారి ఎవరినీ వదలడం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ కలవరపెట్టింది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. కరోనా థర్డ్ వేవ్ పూర్తయిందనే సమయంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయన సూచన చేశారు.తాను స్వల్ప జ్వరంతో సహా ఫ్లూ లాంటి లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
కరోనా మార్గదర్శకాలను అనుసరిస్తూ.. సిడ్నీలోని తన అధికార నివాసంలో ఐసోలేషన్లో ఉన్నట్టు తెలిపారు. మోరిసన్ మంగళవారం అర్థరాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ పై రష్యా దాడిని తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ కు అండగా తన ప్రభుత్వం నిలుస్తుందని మోరిసన్ అన్నారు. ఉక్రెయిన్‌కు ఆస్ట్రేలియా మద్దతును ప్రకటించినట్టు ప్రభుత్వ భవనంపై పసుపు, నీలం రంగుల బల్బులను వెలిగించారు.
