ఆస్ట్రేలియన్ చట్టసభ సభ్యురాలు లిడియా థోర్ప్ సంచలన ఆరోపణలు  చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంటు భవనంలోనే తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టుగా చెప్పారు.

ఆస్ట్రేలియన్ చట్టసభ సభ్యురాలు లిడియా థోర్ప్ సంచలన ఆరోపణలు చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంటు భవనంలోనే తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టుగా చెప్పారు. మహిళలు పని చేయడానికి ఈ భవనం సురక్షితమైన స్థలం కాదని పేర్కొన్నారు. విక్టోరియాకు సేనేటర్ ఉన్న లిడియా థోర్ప్ సెనేట్‌లో ప్రసంగిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తన తోటి సెనేటర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని లిడియా థోర్ప్ బుధవారం ఆరోపించారు. మెట్ల దారిలో మూలన పడేసి.. అనుచితంగా తాకినట్లు ఆరోపణలు చేశారు. పార్లమెంటరీ అనుమతి బెదిరింపుతో తన వ్యాఖ్యను బలవంతంగా ఉపసంహరించుకోవడానికి ముందు ఈ కామెంట్స్ చేశారు. లిబరల్ పార్టీ డేవిడ్ వాన్‌ ఆమె ఈ ఆరోపణలు చేశారు.

‘‘నేను అనుభవించినది.. అనుసరించడం, దూకుడుగా ప్రతిపాదించడం, అనుచితంగా తాకడం. నేను ఆఫీసు తలుపు నుంచి బయటికి నడవడానికి భయపడ్డాను. నేను కొంచెం తలుపు తెరిచి, బయటికి వెళ్లే ముందు అంతా సక్రమంగా ఉందో లేదో తనిఖీ చేస్తాను. నేను ఈ భవనం లోపలికి నడిచినప్పుడల్లా నాతో పాటు ఎవరైనా ఉండవలసి వచ్చింది. ఇలాంటి విషయాలను అనుభవించినప్పటికీ వారి కెరీర్ ప్రయోజనాల కోసం ముందుకు రాని ఇతరులు కూడా ఉన్నారని నాకు తెలుసు’’ అని లిడియా థోర్ప్ చట్టసభ సభ్యులతో అన్నారు.

గురువారం నాడు లిడియా థోర్ప్.. లిబరల్ పార్టీ డేవిడ్ వాన్‌పై తన ఆరోపణలలోని ప్రధానాంశాన్ని పునరుద్ఘాటించారు. అయితే ఆమె వాదనలను డేవిడ్ వాన్‌ తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలతో తాను మానసికంగా దెబ్బతిన్నానని చెప్పారు. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని స్థానిక మీడియాకు తెలిపారు. ఈ ఆరోపణలపై డేవిడ్ వాన్‌‌ను లిబరల్ పార్టీ గురువారం సస్పెండ్ చేసింది. ఇక, ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కాదు.