రష్యా మిలటరీ ఆపరేషన్ లో ఇప్పటికే 137 మంది మరణించారని ఉక్రెయిన్ ప్రకటించింది. గురువారం నుండి ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది.  

కీవో: Russia మిలటరీ ఆపరేషన్ లో ఇప్పటివరకు 137 మంది మరణించారని Ukraine ప్రకటించింది. మరో 316 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు Volodymyr Zelenskyy తెలిపారు. గురువారం నాడు తెల్లవారుజాము నుండి ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇవాళ మనం 137 మంది హీరోలను మన మిలటరీ సిబ్బందిని కోల్పోయామని జెలెన్ స్కీ చెప్పారు. అంతేకాదు 316 మంది రష్యన్ దాడుల్లో గాయపడ్డారని వీడియో సందేశంలో జెలెన్ స్కీ వివరించారు. తమతో కలిసి పోరాడటానికి ఎవరు సిద్దంగా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రశ్నించారు. NATO లో సభ్యత్వానికి హమీ ఇవ్వడానికి ఎవరు సిద్దంగా ఉన్నారని ఆయన అడిగారు,. రష్యా అంటేనే అందరూ భయపడుతున్నారని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. కీవ్ నగరంలోకి రష్యా దళాలు ప్రవేశించాయని ఆయన చెప్పారు. నగర పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని జెలెన్ స్కీ సూచించారు. ప్రజలంతా కర్ఫ్యూ ను పాటించాలని సూచించారు.

ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించడాన్ని నిరసిస్తూ పలు పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున protest కి దిగారు. దీంతో రష్యాలో సుమారు 1700 మందిని Police అదుపులోకి తీసుకొన్నారు.

ఉక్రెయిన్ లో రష్యా బలగాలు మిలటరీ ఆపరేషన్ నిర్వహించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా తప్పుబట్టారు. నాటో ఆధీనంలోని ప్రతి అంగుళం భూమిని రక్షిస్తామని Joe Bidenప్రకటించారు. నాటో ఆధీనంలోని ప్రాంతాన్ని కాపాడేందుకు USA శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తుందని బైడెన్ గురువారం నాడు హమీ ఇచ్చారు.అయితే తమ దేశానికి చెందిన సైన్యం ఉక్రెయిన్ లో రష్యాతో జరిగే మిలటరీ ఆపరేషన్ లో పాల్గొనదని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ తేల్చి చెప్పారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ Putin యుద్దాన్ని ఎంచుకొన్నాడని బైడెన్ చెప్పారు. అతని చర్యలతో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ఆ దేశమే భరించాల్సి వస్తోందని బైడెన్ చెప్పారు. రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్టుగా ప్రకటించింది.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కోసం ఇండియా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చర్యలు ప్రారంభించారు. రష్యా విదేశాంగ మంత్రితో గురువారం నాడు జైశంకర్ మాట్లాడారు.ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తో మాట్లాడానని దౌత్యమే ఉత్తమ మార్గమమని తాను చెప్పానని Jaishankar ట్వీట్ చేశారు.

ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు గాను రొమేనియా, హంగేరీ, స్లోవేకియా, పోలాండ్ సరిహద్దుల ద్వారా ఉక్రెయిన్ లో చిక్కుకొన్న వారిని భారత్ కు రప్పించేందుకు విదేశాంగ పర్యత్నాలను ప్రారంభించింది. ఉక్రెయిన్ లో సుమారు 16 వేల మంది భారతీయులు ఉన్నారని భారత్ ప్రకలించింది.

ఉక్రెయిన్ లో చిక్కుకొన్న భారతీయుల తరలింపునకు హంగేరియన్ విదేశాంగ మంత్రి పీటర్ స్జిజార్టో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.