నైట్ క్లబ్ లో తొక్కిసలాట జరిగి.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఇటలీలో చోటుచేసుకుంది. అంకొనా నగర సమీపంలోని నైట్ క్లబ్ లో అనుకోకుండా ప్రమాదం జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా భయపడి.. బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకొని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి  వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కాగా.. అప్పటికే ఆరుగురు చనిపోయినట్లు గుర్తించారు. మరికొందరు గాయలతో బయటపడ్డారు. ఆ సమయంలో.. నైట్ క్లబ్ లో దాదాపు వెయ్యి మంది యువతీయువకులు ఉన్నారని అధికారులు తెలిపారు. వారంతా సందడిగా డ్యాన్సులు చేస్తుండగా.. ఏదో భయంకరమైన కాలుతున్న వాసన వచ్చిందని.. దీంతో భయపడి పరుగులు తీసినట్లు గాయపడిన యువకుడు ఒకరు తెలిపారు.