Asianet News TeluguAsianet News Telugu

రష్యాలో ఘోర విమానప్రమాదం: 41 మంది సజీవదహనం

రష్యాకు చెందిన ఎరోప్లాట్ సుఖోయ్ సూప్ర జెట్ విమానం మాస్కోలోని షెమెమెత్వేవో విమానాశ్రయం నుంచి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో విమానాన్ని పైలట్ అత్యవసరంగా దించేందుకు ప్రయత్నించారు. 

At Least 41 Dead As Plane On Fire Made Emergency Landing In Moscow
Author
Moscow, First Published May 6, 2019, 6:36 AM IST

మాస్కో: రష్యాలో ఘోరమైన విమానప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 41 మంది మరణించారు. మరణించినవారిలో ఇద్దరు చిన్నారులున్నారు. మరో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. 

రష్యాకు చెందిన ఎరోప్లాట్ సుఖోయ్ సూప్ర జెట్ విమానం మాస్కోలోని షెమెమెత్వేవో విమానాశ్రయం నుంచి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో విమానాన్ని పైలట్ అత్యవసరంగా దించేందుకు ప్రయత్నించారు. 

ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం బలంగా నేలను తాకింది. దాంతో విమానంలో మంటలు చెలరేగాయి. విమానం వెనక భాగంలో మంటలు వ్యాపించాయి. దీంతో 41 మంది మరణించారు ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 78 మంది ఉన్నారు. మిగిలిన 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 

విమానంలో ఏ విధమైన సాంకేతిక లోపం ఎర్పడిందీ తెలియలేదు. టేకాఫ్ అయిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు విమానం మాస్కోలో రెండు సార్లు గాలిలో చక్కర్లు కొట్టినట్లు ఫైట్ రాడార్ 24 తెలిపింది,

Follow Us:
Download App:
  • android
  • ios