ఢాకా:బంగ్లాదేశ్ లో సోమవారం నాడు ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. పద్మ నదిలో ప్రయాణీకులతో వెళ్తున్న స్పీడ్ బోటు ఇసుకను తీసుకెళ్తున్న మరో బోటును  ఢీకొనడంతో  26 మంది మరణించారు. పలువురు నదిలో గల్లంతయ్యారు.మరణించినవారిలో 26 మృతదేహాలను నది నుండి బయటకు తీశారు. నదిలో గల్లంతైన ఐదుగురిని రక్షించినట్టుగా మదరీపూర్ జిల్లా సీనియర్ పోలీస్ అధికారి మిరాజ్ హుస్సేన్ తెలిపారు.

దేశంలోని కరోనా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ స్పీడ్ బోటులో ప్రయాణీకులను తరలిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కరోనా నేపథ్యంలో దేశంలో బుధవారం వరకు లాక్‌డౌన్  అమల్లో ఉంది. దేశంలో పలు ప్రమాదాలు బంగ్లాదేశ్ లో చోటు చేసుకొంటున్నాయి. ఈ ప్రమాదాల్లో వందలాది మంది మరణిస్తున్నారు. 

నెల రోజుల వ్యవధిలో జరిగిన పెద్ద ప్రమాదాలు బంగ్లాదేశ్ లో చోటు చేసుకొన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో కార్గోషిప్, చిన్న ఫెర్రీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 27 మంది మరణించారు.  మరో 12 మండి గల్లంతయ్యారు. గత ఏడాది జూన్ మాసంలో ఢాకాలో జరిగిన ప్రమాదంలో 32 మంది చనిపోయారు. 2020 ఫిబ్రవరి మాసంలో రోహింగ్యాలను తరలిస్తున్న పడవ మునిగిపోయిన  ఘటనలో 15 మంది మరణించారు.