ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించి దాదాపు 22మంది సజీవ దహనమైన సంఘటన చైనాలో  చోటుచేసుకుంది. చైనా రాజధానికి 200 కి.మీ. దూరంలో ఉన్న జాంగ్జియాకవు నగరంలోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది.

పేలుడు కారణంగా ఫ్యాక్టరీ మొత్తం మంటలు అంటుకున్నాయి. దీంతో.. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దాదాపు 20మంది కార్మికులు సజీవదహనమవ్వగా... మరో 20 మంది తీవ్రగాయాలతో బయటపడ్డారు.

ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న దాదాపు 50 కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.