ఫుట్ బాల్ క్లబ్ లో అగ్నిప్రమాదం జరిగిన దాదాపు `10మంది సజీవదహనమైన సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం తెలియడం లేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాద సమయంలో క్లబ్ లో ఎంత మంది ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది. క్షతగాత్రుల వివరాలు సంబంధిత అధికారులు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.