Asianet News TeluguAsianet News Telugu

ఫ్లైట్ గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసిన ప్యాసింజర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? (Video)

దక్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ఫ్లైట్ గాలిలో ఉండగానే ఓ ప్యాసింజర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను ఓపెన్ చేశారు. దీంతో గాలి తుఫాన్‌లా లోనికి దూసుకువచ్చింది. ప్రయాణికులు శ్వాస తీసుకోవడానికి ఇక్కట్లు పడ్డారు.
 

asianga flight passenger opens emergency exit, passengers struggle to breathe kms
Author
First Published May 26, 2023, 5:51 PM IST

న్యూఢిల్లీ: ఓ ప్రయాణికుడు ఫ్లైట్ ల్యాండ్ కాకముందే ఇంకా సుమారు 650 అడుగుల ఎత్తులో ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను ఓపెన్ చేశారు. అంతే ఆ ఫ్లైట్ లోకి వేగంగా గాలి వచ్చేసింది. ఆ గాలి ఎంతలా ఉందంటే.. ఎవరైనా ఎదురుగా నిలబడి ఉంటే కొట్టుకుపోయేవారు. అంత వేగంగా వీచిన గాలితో విమానంలోని ప్రయాణికులకు ఊపిరి ఆడటం కూడా కష్టతరంగా మారింది. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత పలువురు ప్రయాణికులు హాస్పిటల్ పాలయ్యారు. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను ఓపెన్ చేసి ప్యాసింజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు 240 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ బస్ ఏ321- 200 బస్సు ల్యాండ్ అయింది. ఆ ఫ్లైట్ ల్యాండ్ కావడానికి ముందు అంటే సుమారు 200 మీటర్ల ఎత్తులో ఉండగానే ఓ ప్యాసింజర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను మ్యానువల్‌గా లివర్‌ను ఉపయోగించి ఓపెన్ చేసినట్టు ఏషియానా ఎయిర్‌లైన్స్ ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీకి తెలిపింది.

ఎవరూ ఊహించని ఈ ఘటనకు ప్రయాణికులు ఇబ్బందులపాలయ్యారు. చాలా మంది ప్రయాణికులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక సుమారు 9 మంది ప్రయాణికులను హాస్పిటల్‌కు తరలించారు.

Also Read: ఈతకు వెళ్లి డ్యామ్‌లో ఫోన్ పోగొట్టుకున్నాడు.. పంటకు వెళ్లాల్సిన 21 లక్షల లీటర్ల నీటిని మోటర్లతో తోడేశాడు..!

ఫ్లైట్ సేఫ్‌గానే ల్యాండ్ అయిందని, ఇతర పెద్దగా డ్యామేజీ ఏమీ జరగలేదని ఏషియానా ఎయిర్‌లైన్స్ వివరించింది.

ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను ఓపెన్ చేసిన ప్యాసింజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను ఎందుకు ఓపెన్ చేశారా? అని ప్రశ్నిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios