New York: న్యూయార్క్ లో దారుణం జరిగింది. ఆసియాకు చెందిన ఓ వృద్ధ మహిళ జాతి వివక్షకు గురైంది. న్యూయార్క్‌లోని యోంకర్స్‌లో 67 ఏండ్ల వృద్దురాలిపై 125 సార్లు పిడిగుద్దులు వర్షం కురిపించాడు. జాతి వివక్షతో అసభ్యకరంగా దూషిస్తూ.. పాశవికంగా ప్రవర్తించారు. నిందితుడిని 42 ఏళ్ల టమ్మెల్ ఎస్కోగా పోలీసులు గుర్తించారు.
New York: అమెరికాలోని న్యూయార్క్ లో దారుణం జరిగింది. ఆసియాకు చెందిన ఓ వృద్ధ మహిళ జాతి వివక్ష దాడికి గురైంది. అమెరికాకు చెందిన ఓ దుండగుడు( జాతివిద్వేషి) ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. వృద్ధురాలు అనే మానవీయత కూడా లేకుండా.. అత్యంత దారుణంగా , పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో బాధిత వృద్ద మహిళపై దాదాపు 125 సార్లు పిడిగుద్దులను కురిపించాడు. కనీకరం లేకుండా పలుమార్లు కాలితో తన్నాడు. అత్యంత పాశవికమైన ఈ ఘటన న్యూయార్క్ శివారులోని మాన్‌హట్టన్‌కు జరిగింది. ఈ దాడి ఘటన తీవ్ర సంచలనంగా మారింది.
పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం.. వివరాల్లోకెళ్లే.. న్యూయార్క్ నగరంలోని యాన్కీస్ ప్రాంతంలో నివాసముంటున్న 67 ఏళ్ల ఆసియా మహిళపై.. అదే ప్రాంతానికి చెందిన టమ్మెల్ ఎస్కో (42) అనే అమెరికన్ శుక్రవారం సాయంత్రం విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. 67 ఏళ్ల ఆసియన్ మహిళ శుక్రవారం సాయంత్రం తన అపార్ట్‌మెంట్ భవనంలోకి ప్రవేశిస్తుండగా.. టమ్మెల్ ఎస్కో అనే దుండగుడు.. వృద్దురాలు పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను చూసి “ఆసియన్ బిచ్” అని అత్యంత చీనంగా దూషించాడు. అయినా.. వృద్దురాలు ఏం పట్టించుకోకుండా.. తన అపార్ట్ మెంట్ లోకి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో ఎస్కో.. వృద్దురాలిని వెనక్కి లాగి.. ఆమె తలపై కొట్టి, నేలపై నొట్టివేశాడు. ఈ క్రమంలో ఆ వృద్దురాలి పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. ఆమె తలపై పలుమార్లు నిలబడి, ముఖంపై పదేపదే కొట్టాడు. ఈ క్రమంలో దాదాపు 125 పైగా పిడిగుద్దుల వర్షాన్ని కురిపించాడు. ఆమెపై ఏడుసార్లు తన్నినాడు. ఆమెపై ఉమ్మివేసాడని పోలీసులు తెలిపారు.
ఈ దాడి సీసీ కెమెరాలో చిత్రీకరణ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిందితుడిని 42 ఏళ్ల టమ్మెల్ ఎస్కోగా గుర్తించినట్టు తెలిపారు. ఈ దాడిలో ఆమె తలకు, ముఖానికి అనేక గాయాలు అయ్యాయి. అలాగే.. మెదడులో రక్తస్రావం జరిగిందనీ, ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పతి వర్గాలు తెలిపాయి.
యోంకర్స్ పోలీసుల ప్రకారం.. ఎస్కోపై గతంలో కూడా పలు ఆరోపణలున్నాయి. ఎస్కో గతంలో 14 సార్లు పలు కేసుల్లో అరెస్టు అయ్యాడు. ఫిబ్రవరి 2021లో అతను ఒక స్త్రీని ప్లేట్ గ్లాస్ కిటికీ నుండి తోసాడు. జైలు శిక్ష లేకుండా షరతులతో కూడిన డిశ్చార్జ్ పొందాడు. అంతకు ముందు 2011 లో ఒంటరిగా ఉన్న వారిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఇతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. రెండున్నరేళ్ల తర్వాత పెరోల్‌పై విడుదలయ్యాడు.
ఈ ఘటనపై యోంకర్స్ పోలీసు కమీషనర్ జాన్ ముల్లర్ మాట్లాడుతూ.. “ఇది నేను చూసిన అత్యంత భయంకరమైన దాడుల్లో ఒకటి; నిస్సహాయంగా ఉన్న స్త్రీని కొట్టడం జుగుప్సాకరమైనది. జాతి కారణంగా ఆమెను లక్ష్యంగా చేసుకోవడం.. అత్యంత పాశవికం ” అని అన్నారు. "మా కమ్యూనిటీలలో ద్వేష పూరితమైన, హింసాత్మకమైన ప్రవర్తనను సహించబోమని స్పష్టమైన సందేశాన్ని పంపడానికి ఈ ప్రతివాది చట్టం ద్వారా అనుమతించబడిన గరిష్ట శిక్షకు కట్టుబడి ఉండాలి. అని అన్నారు.
ఈ దాడిపై Yonkers మేయర్ మైక్ స్పానో మాట్లాడుతూ..ఈ ఘటనను ఖండించారు. నగరంలో ద్వేషపూరిత నేరాలు భరించలేనంతగా ఉన్నాయని, అనుమానితుడి హేయమైన చర్యలకు.. చట్టం ప్రకారం కఠిన శిక్ష పడ్డాలని, నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని ఆశిస్తున్నాం. మేము బాధితురాలు,ఆమె కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ హేట్ అండ్ ఎక్స్‌ట్రీమిజం డేటా ప్రకారం.. న్యూయార్క్, చుట్టుపక్కల నగరాల్లో ఉన్న ఆసియా అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసులపై దాడులు పెరుగుతున్నాయని, గత ఏడాది US అంతటా AAPI వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు 339% పెరిగాయని నివేదిక వెల్లడించింది.